హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : రషీద్ ఖాన్ సూపర్ హెలికాఫ్టర్ సిక్స్.. ఈ షాట్ కి ధోనీ అయినా ఫిదా అవ్వాల్సిందే..

Viral Video : రషీద్ ఖాన్ సూపర్ హెలికాఫ్టర్ సిక్స్.. ఈ షాట్ కి ధోనీ అయినా ఫిదా అవ్వాల్సిందే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసాన్నే అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చేసి చూపించాడు.

ఇంకా చదవండి ...

అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసాన్నే అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చేసి చూపించాడు. క్రికెట్ లో ధోనీ (Mahendra Singh Dhoni) హెలికాఫ్టర్ షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. కఠినమైన యార్కర్ బాల్ ను అవలీలగా స్టాండ్స్ లోకి సిక్సర్ గా మలుస్తాడు ధోనీ. ఈ షాట్ ఇతర బ్యాట్స్ మన్ ఆడటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ షాట్ ఆడాలంటే ఎంతో కచ్చితత్వం ఉండాలి. కానీ, అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ మాత్రం ధోనీ షాట్ ను దించేశాడు. ఎంతలా అంటే.. ఆ షాట్ ను చూస్తే ధోనీ అయినా ఫిదా అవ్వాల్సిందే. వివరాల్లోకెళితే.. అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అదరగొట్టాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ కొట్టిన హెలికాప్టర్‌ సిక్స్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జోర్డాన్‌ థాంప్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఆఫ్‌ స్టంప్‌ మీదుగా రషీద్‌ హెలకాప్టర్‌ సిక్స్‌ కొట్టాడు. అతని షాట్‌లో ఎంత కచ్చితత్వం అంటే ఫీల్డర్‌కు బంతి దొరికే చాన్స్‌ కూడా ఇవ్వకుండా గ్యాలరీలో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకెళితే.. ఛెస్టర్-లె-స్ట్రీట్‌ స్టేడియంలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సస్సెక్స్, యార్క్‌షైర్ పోటీ పడ్డాయి. రషీద్ ఖాన్ సస్సెక్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ కోహ్లెర్-క్యాడ్మోర్, గ్యారీ బల్లాన్స్ దూకుడుగా ఆడారు. కోహ్లెర్ మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆ ఇద్దరి దూకుడు మంత్రం ముందు సస్సెక్స్ బౌలర్ల వ్యూహాలేవీ ఫలించలేదు. మిడిలార్డర్‌లో గ్యారీ బ్యాలెన్స్ 37 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 రన్స్ సాధించాడు. రషీద్ ఖాన్ బంతితో రాణించలేకపోయాడు. ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. ఎప్పట్లా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటా 25 పరుగులు ఇచ్చాడు. టైనల్ మిల్స్ మూడు, జార్జ్ గ్యార్టన్, ఆర్చీ లెన్హామ్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ తీసుకున్నారు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో యార్క్‌షైర్ భారీ లక్ష్యాన్ని తన ప్రత్యర్థి సస్సెక్స్ ముందు ఉంచగలిగింది.

ఆ తర్వాత 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సస్సెక్స్ జట్టు ఆరంభంలో అదరగొట్టింది. 8.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులను జోడించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 25 బంతుల్లో రెండు ఫోర్లతో 27 పరుగులు, ల్యూక్ రైట్ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 రన్స్ చేశారు. ఆ తరువాత మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ రాణించలేకపోయారు. యార్క్‌షైర్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు వికెట్లను సమర్పించుకున్నారు. రవి బొపారా-9, డెల్రే రౌలిన్స్ 27, డేవిడ్ వీజ్ 19 పరుగులు చేసి, అవుట్ అయ్యారు.

చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశకు చేరింది సస్సెక్స్ టీమ్. డేవిడ్ వీజ్ కూడా అవుట్ కావడంతో ఓటమి తప్పదనే భావించారు సస్సెక్స్ అభిమానులు. ఆ దశలో రషీద్ ఖాన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాది తన పరుగుల ఖాతాను తెరిచిన రషీద్ ఖాన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 17వ ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న సమయంలో హ్యాట్రిక్ బౌండరీలను బాదాడు. ఈ బంతిని అతను హెలికాప్టర్ షాట్ ఆడాడు. అచ్చంగా టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధో్నీని దించేశాడు. ఆ బంతిని అతను ఫెన్సింగ్ దాటించిన తీరు బ్యాటింగ్ ప్రొఫెషనలిజానికి అద్దం పట్టింది.

యార్క్‌షైర్ బౌలర్ విల్లీ వేసిన 18వ ఓవర్‌లో రషీద్ ఖాన్ వరుసగా ఫోర్లు కొట్టాడు. 2,3,4 బంతులను బౌండరీలుగా మలిచాడు. దీనితో ఆ ఓవర్‌లో మొత్తంగా 16 పరుగులు వచ్చాయి. దీనితో సమీకరణాలు చివరి ఆరు బంతులకు ఆరు పరుగులుగా మారిపోయాయి. చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో సింగిల్స్ తీశారు రషీద్ ఖాన్, క్రిస్ జోర్డాన్.మూడో బంతికి పరుగులేవీ రాలేదు. నాలుగో బంతికి క్రిస్ జోర్డాన్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్.. సస్సెక్స్ వశమైంది.సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ రిలీఫ్ కల్పించాడు రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాల మధ్య రషీద్ ఖాన్ ఆటతీరు ప్రభావితం కావొచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ టెన్షన్‌కు గురైంది. వాటన్నింటినీ అతను పటాపంచలు చేశాడు. ఆటపై తనకు ఉన్న ఏకాగ్రత ఏ మాత్రం చెదిరిపోలేదనే సందేశాన్ని పంపించాడు.

అయితే, ఈ మధ్యకాలంలో రోజూ వార్తల్లో నిలుస్తోన్నాడీ సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్ బౌలర్. అరాచకత్వానికి, రాక్షసత్వ పరిపాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కరడుగట్టిన మత ఛాందసవాదులు.. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత.. ఆ దేశ క్రికెట్ జట్టు భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తాలిబన్లు.. క్రికెట్‌ను నిషేధిస్తారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- రషీద్ ఖాన్.. పరిస్థితి ఏమౌతుందనే సస్పెన్స్ నెలకొంది.

First published:

Tags: Afghanistan, Cricket, IPL 2021, Rashid Khan, Sports, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు