Afghanistan vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 Match at Cardiff : కార్డిఫ్ వేదికగా శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్గన్ బౌలర్లు సంచలనం సృష్టిస్తున్నారు. 32 ఓవర్లు ముగిసేనాటికి శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. తొలి వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం దొరికినప్పటికీ శ్రీలంక బ్యాట్స్ మెన్ టపటప పెవిలియన్ బాట పడుతూ కేవలం 5 ఓవర్ల వ్యవధిలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఓపెనర్ కుశాల్ పెరిరా మినహా ఒంటరి పోరాటం మినహా స్కోరు బోర్డు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. 16వ ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగుల వద్ద పటిష్ట స్థితిలో కనిపించిన శ్రీలంక 23వ ఓవర్ నాటికి ఏకంగా 150 పరుగులకు ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. లంక బ్యాట్స్ మెన్ కు ఆఫ్గన్ బౌలర్ నబి షాక్ ఇచ్చాడు. 22వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. తిరుమన్నె (25), కుశాల్ మెండిస్ (2), మాథ్యూస్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ కావడంతో శ్రీలంక స్కోరుకు బ్రేకులు పడ్డాయి. ఇక 26వ ఓవర్లో తిసారా పెరీరా రనౌట్ గా నిలవడంతో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్లో ఇసురు ఉడానా 7 వికెట్ రూపంలో పెవిలియన్ బాటపడ్డాడు.
ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ నబీ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, దవ్లాత్ జద్రాన్, హమీద్ హసన్, చెరోవికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే తొలుత టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే రెండు జట్లు కూడా టోర్నీలో తొలివిజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఆసీస్ చేతిలో ఇప్పటికే ఆఫ్గాన్ జట్టు ఓటమి చెందగా, అటు శ్రీలంక సైతం న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. రెండు జట్లలో ఎవరు గెలిచిన వరల్డ్ కప్ లో బోణి కొట్టడం ఖాయం.
The covers are coming on in Cardiff.
Let's hope the break in play isn't long – what a game this has been so far! #AFGvSL #CWC19 pic.twitter.com/FEKrGz9U3W
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019, Sri Lanka