Afghanistan vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 Match at Cardiff :
కార్డిఫ్ వేదికగా శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా, కరుణరత్నే ధాటిగా ఆడటంతో శ్రీలంక 12 ఓవర్లు ముగిసే నాటికి వికెట్లేమి నష్టపోకుండానే 86 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆట మొదలు పెట్టిన శ్రీలంక ఓపెనర్లు 29 బంతుల్లోనే 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుశాల్ పెరీరా ధాటిగా ఆడుతూ బౌండరీలతో అదరగొడుతుండగా, కరుణ రత్నే మాత్రం నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. మరోవైపు ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో హమీద్ హసన్ వేసిన రెండు ఓవర్లలోనే 30 పరుగులు సమర్పించుకోగా, మహ్మద్ నబీ మాత్రం 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తొలి పవర్ ప్లేలో శ్రీలంక ఏకంగా 79 పరుగులు సాధించడం విశేషం.
ఇదిలా ఉంటే తొలుత టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే రెండు జట్లు కూడా టోర్నీలో తొలివిజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఆసీస్ చేతిలో ఇప్పటికే ఆఫ్గాన్ జట్టు ఓటమి చెందగా, అటు శ్రీలంక సైతం న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. రెండు జట్లలో ఎవరు గెలిచిన వరల్డ్ కప్ లో బోణి కొట్టడం ఖాయం.
Blazing start from Sri Lanka! 🔥
They've reached 62 in seven overs, with Kusal Perera going gung-ho. Just the start #LionsRoar needed. #CWC19#AFGvSL LIVE 👇https://t.co/Ewx3JI0MHG pic.twitter.com/b874kIXLg4
— ICC (@ICC) June 4, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, ICC Cricket World Cup 2019, Sri Lanka