హోమ్ /వార్తలు /క్రీడలు /

Afghanistan : మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికి చంపింది తాలిబన్లు కాదు..! అసలు నిజం ఇదే..!

Afghanistan : మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికి చంపింది తాలిబన్లు కాదు..! అసలు నిజం ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Afghanistan : మహిళా వాలీబాల్ ప్లేయర్ ను తాలిబన్లు తల నరికి చంపారన్న వార్త అన్ని ప్రముఖ న్యూస్ ఛానెళ్ల లో ప్రసారం అయింది.

  తాలిబన్ల రాజ్యం ఏర్పడిన తర్వాత ఛీర్ గర్ల్స్‌ను టీవీల్లో చూపిస్తున్నారనే కారణంతో దేశంలో ఐపీఎల్ (IPL) ప్రసారాలపై నిషేధం విధించిన తాలిబన్లు, మహిళలు బహిరంగంగా క్రీడలు ఆడడంపై కూడా బ్యాన్ వేశారు.శరీర అవయవాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుందని అఫ్ఘాన్ మహిళా క్రికెట్ జట్టును కూడా నిషేధించిన తాలిబన్లు, తాజాగా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వాలీబాల్ ఆడుతుందనే కారణంగా ఓ యువ క్రీడాకారిణిని దారుణంగా హత్య చేశారు. పాశవిక పరిపాలనకు అద్దం పట్టేలా జరిగిన ఈ సంఘటన కాబూల్ (Kabul) సమీపంలోనే జరిగింది. ఆఫ్ఘాన్ అండర్-19 జాతీయ వాలీబాల్ జట్టుకి చెందిన ఓ 18 ఏళ్ల మహ్జాబిన్ హకీమా అనే క్రీడాకారిణి తాలిబన్ల హెచ్చరికలు పట్టించుకోకుండా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. దీంతో ఆమెను బంధించిన తాలిబన్లు, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారట. ఈ వార్త అన్ని జాతీయ ఛానెళ్లలో, పలు అంతర్జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే.

  అయితే, ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఆగష్ట్ 5 న ఆ మహిళా వాలీ ప్లేయర్ చనిపోయింది. ఇక, అప్పటికీ అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడలేదు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అయితే, మహ్జాబిన్ హకీమా ను ఆమె అత్తంటి వారే చంపినట్లు ఆధారాలు బయటపడ్డాయ్. అల్ట్ న్యూస్ ఏజెన్సీ ఈ నిజాల్ని బయటపెట్టింది.

  ఈ విషయమై మహ్జాబిన్ హకీమా తల్లిదండ్రులను కలిస్తే అసలు విషయం తెలిసింది. హకీమాను తాలిబన్లు చంపలేదని.. ఆమె అత్తంటి వారే చంపినట్లు వారు మీడియాకు తెలిపారు. అంతేగాక, మహ్జాబిన్ హకీమా అఫ్గాన్ ఆర్మీలో కమాండర్ గా పనిచేసింది.

  అయితే, అఫ్గానిస్తాన్ లో మహిళల విషయంలో అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ వారి హక్కులను హరిస్తున్నారు తాలిబన్లు. ఇప్పటికే స్త్రీలను విద్య,ఉద్యోగాలకు దూరం చేసే చర్యలకు పూనుకున్నారు.బాలికల స్కూళ్లను రీఓపెన్ చేయకుండా కేవలం బాలుర స్కూళ్లను మాత్రమే తెరిచారు.కాబూల్ నగరంలో పనిచేసే మహిళలను ఉద్యోగాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.కేవలం పురుషులతో భర్తీ చేయలేని పోస్టుల్లో మాత్రమే మహిళలు కొనసాగుతారని చెప్పారు.ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో మహిళా ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగాలు మానిపించి ఇళ్లకు పంపించేశారు.ఒకవేళ్లీ ఆఫీసులకు వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.స్త్రీలంటే తాలిబన్ల దృష్టిలో కేవలం పిల్లలను కనే యంత్రాలు మాత్రమే.వారి హక్కులను తాలిబన్లు ఏమాత్రం గౌరవించట్లేదు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Afghanistan, Crime, Sports, Taliban

  ఉత్తమ కథలు