పసికూన ఆఫ్గనిస్థాన్ సంచలనం...బంగ్లాదేశ్ పై ఏకైక టెస్టు మ్యాచులో ఘన విజయం

ఆఫ్గనిస్తాన్‌ విధించిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించంలో బంగ్లాదేశ్ తడబడింది. ఆఫ్గన్ బౌలర్లు విజృంభణతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కేవలం 173 పరుగులకే అలౌటయ్యారు.

news18-telugu
Updated: September 9, 2019, 10:40 PM IST
పసికూన ఆఫ్గనిస్థాన్ సంచలనం...బంగ్లాదేశ్ పై ఏకైక టెస్టు మ్యాచులో ఘన విజయం
విజాయానందంలో ఆఫ్గన్ జట్టు
news18-telugu
Updated: September 9, 2019, 10:40 PM IST
పసికూన ఆఫ్గనిస్తాన్‌ మరోసంచలనాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచులో ఆఫ్గన్ జట్టు 224 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్‌ విధించిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించంలో బంగ్లాదేశ్ తడబడింది. ఆఫ్గన్ బౌలర్లు విజృంభణతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కేవలం 173 పరుగులకే అలౌటయ్యారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి బంగ్లా భరతం పట్టాడు. అతనితో పాటు మరో బౌలర్ జహీర్ ఖాన్ సైతం మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. బంగ్లా బ్యాట్స్ మెన్ లలో షద్ మన్ ఇస్లాం(41), షకిబ్ ఉల్ హసన్(44) మాత్రమే వికెట్ల వద్ద నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్‌ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్గనిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేయగా, బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్గనిస్థాన్ జట్టు 260 పరుగులు చేసింది. ఈ క్రమంలో చివరి ఇన్నింగ్స్‌లో కేవలం 173 పరుగులకే చేతులు ఎత్తేసింది. ఇదిలా ఉంటే ఆఫ్గనిస్థాన్ గతంలో ఐర్లాండ్‌పై టెస్టు మ్యాచ్ లో విజయం సాధించి బోణీ కొట్టింది.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...