T20 World Cup: అఫ్గానిస్తాన్‌కు ఐసీసీ ఝలక్ ఇవ్వనుందా? తాలిబాన్ జెండాతో వరల్డ్ కప్‌కు నిరాకరణ?

పురుషుల టీ20 వరల్డ్ కప్ త్వరలో యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానున్నది. ర్యాంకింగ్స్ ఆధారంగా అఫ్గానిస్తాన్ జట్టు సూపర్ 12కు క్వాలిఫై అయ్యింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్లు రాజ్యం ఏలుతున్నారు. వారి జెండాతోనే అఫ్గానిస్తాన్ వరల్డ్ కప్‌లో ఆడాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ దానిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. (PC: ACB Media)

T20 World Cup: అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టును టీ20 వరల్డ్ కప్ నుంచి తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఆ జట్టుపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆదివారం స్పష్టం చేసింది.

  • Share this:
    పురుషుల టీ20 వరల్డ్ కప్ త్వరలో యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానున్నది. ర్యాంకింగ్స్ ఆధారంగా అఫ్గానిస్తాన్ జట్టు సూపర్ 12కు క్వాలిఫై అయ్యింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్లు రాజ్యం ఏలుతున్నారు. వారి జెండాతోనే అఫ్గానిస్తాన్ వరల్డ్ కప్‌లో ఆడాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ దానిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. (PC: ACB Media)


    ఏ క్రికెట్ బోర్డుపై అయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఐసీసీ నిబంధనల ప్రకారం చెల్లదు. అయితే తాలిబన్లు రాజ్యాధికారంలోకి రాగానే బోర్డులో తమ మనుషులను నియమించుకున్నది. అంతే కాకుండా జెండాను కూడా మర్చేసింది. (PC: ACB Media)


    టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్గానిస్తాన్ పాల్గొనడంపై ఎలాంటి సందేహాలు లేవని.. ఆ జట్టు మెగా టోర్నీ కోసం సిద్దంగా ఉన్నదని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్డైస్ స్పష్టం చేశారు. దీంతో అఫ్గానిస్తాన్ జట్టు టీ20లో పాల్గొనడంపై అనుమానాలు తొలిగిపోయాయి. (PC: ACB Media)


    ఐసీసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో అఫ్గానిస్తాన్ జట్టు టీ20 వరల్డ్ కప్ కోసం బయలుదేరింది. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు క్రికెటర్లకు కాబూల్ ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికారు. (PC: ACB Sports)


    అఫ్గానిస్తాన్ క్రికెటర్లు ప్రస్తుతం ఖతర్‌లో ప్రీ టీ20 వరల్డ్ కప్ క్యాంప్‌లో ఉన్నారు. అక్కడి స్టేడియంలో పూర్తి స్థాయలోప్రాక్టీస్ చేస్తున్నారు. PC: ACB Sports)


    అఫ్గానిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్2లో ఉన్నది. ఇదే గ్రూప్‌లో ఇండియా, న్యూజీలాండ్, పాకిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. PC: ACB Sports)


    అఫ్గానిస్తాన్ కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్ తప్పుకోవడంతో మహ్మద్ నబీకి బాధ్యతలు అప్పగించారు. వరల్డ్ కప్ ఆడనున్న అప్గానిస్తాన్ జట్టు ఇదే. PC: ACB Sports)
    Published by:John Naveen Kora
    First published: