హోమ్ /వార్తలు /క్రీడలు /

Afghanistan Player : విమానం నుంచి పడిన క్రీడాకారుడు.. శోకసంద్రంలో యావత్ క్రీడాలోకం..

Afghanistan Player : విమానం నుంచి పడిన క్రీడాకారుడు.. శోకసంద్రంలో యావత్ క్రీడాలోకం..

Zaki Anwari

Zaki Anwari

Afghanistan Player : ఏదో ఒక విధంగా ప్రయాణించాలనే ఆందోళనలతో ఎక్కడపడితే అక్కడ కూర్చుని రావడంతో కొద్ది మంది ప్రాణాలు గాల్లో కలిసిన విషయం తెలిసిందే. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి.

అప్గానిస్తాన్‌లో (Afghanistan) ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని (Democracy) కూలదోసి తాలిబాన్లు (Talibans) ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు ఆదివారం కాబూల్ నగరాన్ని స్వాధీనంచేసుకున్నాక అప్గానిస్తాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాలిబాన్ల నుండి అఫ్గాన్ మద్దతు దారులు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు పెట్టారు.. .ఈ నేపథ్యంలోనే కాబుల్ విమానాశ్రాయంలో వేల మంది తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇటు ఇటు పరుగులు తీశారు..దీంతో విమానంలో దొరికిన చోటల్లా కూర్చుని ప్రయాణించారు..అయితే ఆ పరుగులో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రయాణంలో విమానం నుంచి కింద పడిన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కల్గించాయి. ఏదో ఒక విధంగా ప్రయాణించాలనే ఆందోళనలతో ఎక్కడపడితే అక్కడ కూర్చుని రావడంతో కొద్ది మంది ప్రాణాలు గాల్లో కలిసిన విషయం తెలిసిందే. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వివరాలు వెల్లడి కాగా మరో యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే ఆ దేశ జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. ఈ విషాదకర వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్తాన్‌లో భయాందోళనలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన ఆక్రమించగా ఆ భయంతో ఆ తెల్లారి 16వ తేదీన ప్రజలు కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగుల బాట పెట్టారు. అక్కడ ఉన్న అమెరికా యుద్ధ విమానం ఎక్కి ముగ్గురు కిందపడిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరు సోదరులు కాగా మరో యువకుడు ఆ దేశ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది.


ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం కలచివేస్తోంది. అతడి పేరు జాకీ అన్వరీ. అఫ్గానిస్తాన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ ధ్రువీకరించింది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇంత జరుగుతున్నా.. తాలిబాన్లు శాంతి జపం పాటిస్తున్నామని చెబుతున్నారని కాని వందల మంది కాల్పుల్లో మృత్యువాత పడ్డట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే..మరోవైపు ఆ రోజు జరిగిన సంఘటనలో తొక్కిసలాటలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో అయితే సాధారణ రైలు ప్రయాణికులు ప్రయాణించినట్టుగా వెళ్లిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని అశ్చర్యానికి గురి చేశాయి.

First published:

Tags: Afghanistan, Flight, Football, Sports, Taliban

ఉత్తమ కథలు