Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త సీఈవోగా తాలిబన్ నేత.. ఇటీవలే అజ్ఞాతవాసం వీడిన నసీబ్

అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త సీఈవోగా తాలిబన్ నేత నియామకం (PC: ACB Media/Twitter)

అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కొత్త సీఈవోగా తాలిబన్ యువ నేత నసీబ్ జద్రాన్‌ను నియమించారు. ఈ మేరకు ఏసీబీ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

  • Share this:
    అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) (Afghanistan Cricket Board) కొత్త సీఈవోగా తాలిబాన్ యువ నేత నసీబ్ జద్రాన్‌ నియమించబడ్డాడు. ఈ మేరకు కొత్త సీఈవోను ఏసీబీ చైర్మన్ అజీజుల్లా ఫాజిల్ (Azizullah Fazil) సోమవారం ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ (Taliban) రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పలు కీలక పోస్టులను వారితోనే భర్తీ చేస్తున్నారు. తాలిబన్‌లతో కలసి ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న నసీబ్ జద్రాన్.. ఇటీవలే అజ్ఞాతం వీడి బయటకు వచ్చాడు. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నసీబ్.. చాలా కాలంగా తాలిబన్ కోసం పని చేస్తున్నాడు. కాబూల్‌ను ఆక్రమించుకున్న అనంతరమే నసీబ్ బయటి ప్రపంచానికి తన ముఖం చూపించాడు. క్రికెట్ (Cricket) పట్ల ఆసక్తి, అవగాహన ఉన్న నసీబ్‌ను ఏసీబీ సీఈవోగా నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.

    రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ తొలి సారి అఫ్గానిస్తాన్‌ను పరిపాలించిన సమయంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అమ్మాయిలు పాఠశాలలు వెళ్లడంపై, మహిళల పని చేయడంపై నిషేధం విధించారు. అంతే కాకుండా ఆఫ్గానిస్తాన్‌లో మహిళల క్రికెట్‌ను కూడా బ్యాన్ చేశారు. అయితే తాలిబన్ పరిపాలన ముగిసిన తర్వాత 2010లో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు మహిళల క్రికెట్‌ను తిరిగి ప్రారంభించింది. గత ఏడాదే 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం అఫ్గాన్‌లో తాలిబన్ తిరిగి రాజ్యాధికారం చేపట్టడంతో ఏసీసీ మహిళ క్రికెట్‌ను నిలిపివేసింది.

    RCB vs KKR: బెంగళూరుపై కోల్‌కతా ఆల్‌రౌండ్ విజయం.. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన కేకేఆర్


     






    అయితే పురుషుల క్రికెట్‌కు తమ సపోర్ట్ ఉంటుందని ఇప్పటికే తాలిబన్ ప్రకటించిన నేపథ్యంలో టీ20 క్రికెట్ ఆడటానికి అఫ్గానిస్తాన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకున్నది. మహిళా క్రికెట్‌ను కనుక తాలిబన్ అనుమతించకపోతే ఈ ఏడాది జరగాల్సిన ఏకైక పురుషుల టెస్టు మ్యాచ్ కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. మహిళల క్రికెట్ అభివృద్ది కూడా అన్ని బోర్డుల ప్రధానమైన కర్తవ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. అయితే ఆ విషయంపై ఇంకా ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు తాలిబన్ నేతనే ఏసీబీ సీఈవోగా చేసిన తర్వాత మహిళల క్రికెట్ తిరిగి ప్రారంభం అవుతుందనే నమ్మకం కూడా పోయింది.
    Published by:John Naveen Kora
    First published: