• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • AFGHANISTAN BATSMAN NAJEEB TARAKAI LOSES LIFE IN ROAD ACCIDENT SU

Najeeb Tarakai: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నజీబ్ దుర్మరణం

Najeeb Tarakai: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నజీబ్ దుర్మరణం

నజీబ్ తారకై(Najeeb Tarakai)

రోడ్డు ప్రమాదంలో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నజీబ్ తారకై దుర్మరణం చెందాడు. జలాలాబాద్‌లోని తూర్పు నంగర్‌హార్‌లో రోడ్డు దాటుతున్న అతన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు.

  • Share this:
    రోడ్డు ప్రమాదంలో అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ నజీబ్ తారకై దుర్మరణం చెందాడు. జలాలాబాద్‌లోని తూర్పు నంగర్‌హార్‌లో రోడ్డు దాటుతున్న అతన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు. అనంతరం చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నజీబ్ మరణించిన విషయాన్ని అఫ్ఘానిస్తాన్ క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

    "అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు, క్రికెట్‌ను ప్రేమించే వారిగా నజీబ్‌ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అతడు దూకుడైన ఆటతీరును ప్రదర్శించేవాడు. నజీబ్ లోని లోటు తీరనిది. మంచి మనసు ఉన్న 29 ఏళ్ల నజీబ్ ట్రాఫిక్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోవడం తమను షాక్‌‌కు గురిచేసింది. అల్లా అతనిపై దయ ఉంచుతాడని ఆశిస్తున్నాం." అఫ్ఘాన్ క్రికెట్  బోర్డు ట్వీట్ చేసింది.

    ఇక, 2014 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నజీబ్.. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. అఫ్ఘానిస్తాన్ తరఫున్ 12 టీ-20 మ్యాచ్‌లు కూడా ఆడిన నజీబ్.. 2017లో ఐర్లాండ్‌పై 90 పరుగులు చేశాడు. మొత్తంగా 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నజీబ్.. 47.20 యావరేజ్‌తో 2030 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓ డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నజీబ్ ఒక వన్డే మ్యాచ్ ఆడాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు