AFG vs SL 2nd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా శ్రీలంక (Sri Lanka)తో జరుగుతున్న రెండో వన్డేలోనూ అఫ్గానిస్తాన్ (Afghanistan) అద్బుత ప్రదర్శన చేసింది. టి20 ఫార్మాట్ లో బలమైన జట్టుగా ఎదిగిన అఫ్గానిస్తాన్.. వన్డే, టెస్టుల్లో ఇంకా అనుభవం సాధించలేదు. అయితే తాజాగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అద్బుత ఆటతీరును కనబరుస్తుంది. తొలి వన్డేలో శ్రీలంకను ఓడించి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అఫ్గానిస్తాన్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 48.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (73 బంతుల్లో 68; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకం బాదాడు. రహ్మద్ షా (78 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇబ్రహీం జద్రాన్ (10) విఫలం అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన రహ్మత్ షాతో కలిసి రహ్మనుల్లా గుర్బాజ్ జట్టును ఆదుకున్నాడు. వీరు రెండో వికెట్ కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ 6 పరుగుల తేడాలో పెవిలియన్ కు చేరుకున్నారు. వీరి తర్వాత మిగిలిన అఫ్గాన్ బ్యాటర్లు విఫలం అయ్యారు. చివర్లో మొహమ్మద్ నబీ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఒక దశలో అఫ్గానిస్తాన్ 250 పరుగుల మార్కును ఈజీగా అందుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ ఆ మార్కుకు దూరంగా ఆగిపోయింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు. తీక్షణ, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు.
A brilliant fightback from Sri Lanka ???? They bowl out Afghanistan for 228! Watch the #SLvAFG series on https://t.co/CPDKNxpgZ3 (in select regions) ???? pic.twitter.com/2GuKezvHVC
— ICC (@ICC) November 27, 2022
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక కేవలం 234 పరుగులకే ఆలౌటైంది. ఈ రకంగా చూస్తే అఫ్గానిస్తాన్ బౌలింగ్ ను ఆడటం శ్రీలంకకు అంత తేలికైన విషయం అయితే కాదు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరూఖీ లాంటి బౌలర్ల ఉండటంతో శ్రీలంక లక్ష్య ఛేదన అంత సులభంగా జరిగేలా లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Rashid Khan, Sri Lanka