హీరోయిన్ అనుపమ, క్రికెటర్ బుమ్రా లవ్‌లో ఉన్నారా..?

క్రికెటర్స్‌కు సినిమా స్టార్స్‌కు సంబంధించిన ఏ వార్తయినా ఇట్టే వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ అనుపమ, క్రికెటర్ బుమ్రా లవ్‌లో ఉన్నారని దాని సారాంశం.

news18-telugu
Updated: June 11, 2019, 1:02 PM IST
హీరోయిన్ అనుపమ, క్రికెటర్ బుమ్రా లవ్‌లో ఉన్నారా..?
నటి అనుపమ, క్రికెటర్ బుమ్రా
  • Share this:
అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్‌‌తో సంబందం లేకుండా ఈ భామకు తెలుగులో భాగానే ఆఫర్స్ వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ'లో అనుపమ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ భామ. అది అలా ఉంటే.. క్రికెటర్స్‌కు సినిమా స్టార్స్ సంబంధించిన ఏ వార్తైన ఊరికే వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ అనుపమ, టీమిండియా క్రికెటర్ జస్‌ప్రిత్ బుమ్రా లవ్‌లో ఉన్నారని... నెట్టింట్లో  తెగ చక్కర్లు కొడుతోంది.  వివరాల్లోకి వెళ్తే.. 'ప్రేమమ్' నటి అనుపమ పరమేశ్వరన్‌, టీమిండియా పేసర్ బుమ్రా ప్రేమించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనికి తోడు సోషల్‌మీడియాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమేనని సమాచారం.

అంతేకాకుండా వీరిద్దరూ.. ఒకరి పోస్ట్‌లను ఒకరు తెగ లైక్‌‌లు చేసుకుంటారట. దీంతో వీరి అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా ఓ అభిప్రాయానికి వచ్చి.. వీరి గురించి, వీరి ప్రేమ గురించి తెగ చర్చిస్తున్నారు. అయితే  ఈ వార్తల్లో నిజం లేదని.. హీరోయిన్ అనుపమ తేల్చేసి చెప్పేసింది. ఆమె ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా తనకు మంచి స్నేహితుడని స్పష్టం చేసింది. అంతేకాదు ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి వదంతులు సృష్టించడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని..ఎందుకు ఇలాంటీ రూమర్స్ సృష్టిస్తున్నారో అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>