హోమ్ /వార్తలు /క్రీడలు /

Actor Siddharth - Saina : సైనాను అవమానిస్తూ హీరో సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్

Actor Siddharth - Saina : సైనాను అవమానిస్తూ హీరో సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్

Actor Siddharth - Saina

Actor Siddharth - Saina

Actor Siddharth - Saina : సిద్ధార్థ్... ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. లేటెస్ట్ గా సిద్ధార్థ్ సైనా ట్వీట్ కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు పెద్ద రచ్చ రేపుతోంది. ఇంతకీ సైనా ఏం ట్వీట్ చేసింది? దానికి సిద్ధార్ధ ఏం ట్వీట్ చేశాడు? ఈ ట్వీట్ల రాద్ధాంతమేంటంటే..

ఇంకా చదవండి ...

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేపుతోంది. నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువగానే వార్తల్లో నిలిచాడు హీరో సిద్ధార్థ్ (Actor Siddharth). ‘బొమ్మరిల్లు’ వంటి డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్లీ హిట్టు కొట్టలేకపోయిన సిద్ధార్థ్... ‘తెలువారికి టేస్ట్ లేదంటూ’ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. తాజాగా అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ’ సినిమా కలెక్షన్లపై ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసి, బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సిద్ధార్థ్... ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. లేటెస్ట్ గా సిద్ధార్థ్ సైనా ట్వీట్ కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు పెద్ద రచ్చ రేపుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ సిద్ధార్ధ్ పై మండిపడుతున్నారు. సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్​ చేయాలని ట్విట్టర్​ ఇండియాకు లేఖ రాసింది. సైనా నెహ్వాల్​పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.

ఇంతకీ సైనా ఏం ట్వీట్ చేసింది? దానికి సిద్ధార్ధ ఏం ట్వీట్ చేశాడు? ఈ ట్వీట్ల రాద్ధాంతమేంటంటే.. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ పంజాబ్​ టూర్​లో ఆయన కాన్వాయ్ భద్రతా వైఫల్యం ఎంతగా దుమారం రేపిందో..దానికి సైనా మోడీకి మద్దతుగా పెట్టిన ట్వీట్..దానికి సిద్ధార్ధ పెట్టిన కామెంట్స్ అంతకంటే ఎక్కువ దుమారం రేపుతున్నాయి.

తాజాగా జనవరి 5న పంజాబ్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కొందరు నిరసనవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రోడ్డుకు అడ్డంగా భారీ కేడ్లతో నిరసన వ్యక్తం చేయడంతో ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా, ప్రధాని కాన్వాయ్‌ని పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది... ఈ సంఘటనపై క్రీడా ప్రపంచం కూడా స్పందించింది.

" ప్రధానిపైనే దాడి జరిగితే, ఆ దేశంలో భద్రత ఉందని ఎలా చెప్పగలం. భారత ప్రధాని మోదీపై జరిగిన ఈ దుర్మార్గమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. " అంటూ ట్వీట్ చేసింది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.

షటిల్ స్టార్ సైనా నెహ్వాల్ ట్వీట్‌కి హీరో సిద్ధార్థ్ స్పందించాడు. " అతిచిన్న కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్... దేవుడా... భారతదేశాన్ని రక్షించేవాళ్లు కూడా ఉన్నారు... షేమ్ ఆన్ యూ రిహానా... " అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్లకు నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన వస్తోంది. తెలుగు, తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందించింది. " ఇది నిజంగా క్రూరత్వం సిద్ధార్థ్... ఎంతో మంది మహిళలు దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, నువ్వు దాన్నే సపోర్ట్ చేశావ్." అంటూ కామెంట్ చేసింది చిన్మయి.

అంతటితో ఆగకుండా " కాక్ అండ్ బుల్... ఇది నా రిఫరెన్స్... ఈ పుస్తకం చదవకుండా మాట్లాడితే తప్పే అవుతుంది... మిమ్మల్ని అవమానించాలని ఏదీ చెప్పలేదు, ఏదీ ప్రేరేపించాలని చెప్పింది కాదు... పీరియడ్. " అంటూ మరో ట్వీట్ వేశాడు సిద్ధార్ధ్

అంతేకాకుండా హీరో సిద్ధార్థ్ ట్వీట్‌లో " పీరియడ్ " అనే పదాన్ని వాడడాన్ని కూడా స్త్రీవాదులు, మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సిద్ధార్థ్ ఈ పదాన్ని పురుషాహంకారంతో మహిళలను అవమానించేందుకే వాడాడని ఆరోపిస్తున్నాడు.

అలానే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై షట్లర్ సైనా నెహ్వాల్ కూడా స్పందిస్తు..సిద్ధార్థ్​ను నటుడిగా ఇష్టపడతానని.. కానీ అతడి వ్యాఖ్యలు సరిగా లేవని..సరైన పదాలు ఉపయోగించి మాట్లాడాలని సూచించారు.

First published:

Tags: Badminton, Hero siddarth, PM Narendra Modi, Saina Nehwal, Sports

ఉత్తమ కథలు