Home /News /sports /

ACTOR R MADHAVAN REACTS TO MIRABAI CHANU IMAGE HOPE THIS IS NOT TRUE ACTOR MADHAN RETWEETS HE IMAGE JNK

Mirabai Chanu: చాను.. ఇది నిజమా? నాకు మాటలు రావడం లేదు.. నటుడు మాధవన్ భావోద్వేగ ట్వీట్

చానును అలా చూసి తట్టుకోలేకపోయిన నటుడు మాధవన్ (Olympics)

చానును అలా చూసి తట్టుకోలేకపోయిన నటుడు మాధవన్ (Olympics)

మీరాబాయ్ చానును అలా చూసి బాధపడిన నటుడు ఆర్ మాధవన్. ఇది నిజం కాదనే నేను అనుకుంటున్నాను అంటూ భావోద్వేగమైన ట్వీట్ చేశాడు.

    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత దేశానికి తొలి పతకాన్ని (First Medal) అందించిన మీరాబాయ్ చాను (Mirabai Chanu) ఇప్పుడు పెద్ద సెలెబ్రిటీలా మారిపోయింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం తీసుకొని వచ్చింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత మణిపూర్‌కు చెందిన మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం (Silver Medal) తీసుకొని వచ్చింది. రియో ఒలింపిక్స్‌లో తుది రౌండ్లకు అర్హత కూడా సాధించలేకపోయిన చాను ఈ సారి ఏకంగా వెండి పతకాన్ని తన మెడలో వేసుకొని 130 కోట్ల భారతీయుల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. పతకంతో ఇండియాకు వచ్చిన ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు ఆమెను అభినందించారు. రైల్వే శాఖ ఆమెకు ప్రమోషన్‌తో పాటు నగదు పురస్కారాన్ని ప్రకటించింది. మరోవైపు ఆమెకు పోలీసు శాఖలో కూడా ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఒలింపిక్స్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న చాను రెండేళ్లు ఇంటికి దూరంగా ఉన్నది. డైట్ కూడా కఠినంగా ఉండటంతో బయట ఫుడ్స్ కూడా తినలేదు. తనకు పిజ్జా తినాలని ఉందని చెబితే.. డోమినోజ్ ఏకంగా జీవితాంతం నీకు పిజ్జా ఫ్రీ అని చెప్పింది. కాగా, ఇంటికి వెళ్లిన చాను నేలపై కూర్చొని అన్నం తింటున్న ఫొటోను ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఇల్లు కూడా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలిపేలా ఉన్నది.

    ఈ ఫొటో చూసిన నటుడు మాధవన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మాధవన్.. ఇది నిజం కాదు కదూ.. నాకు నోట మాటలు రావడం లేదు.. అంటూ కామెంట్ చేశాడు. దేశానికే వన్నె తెచ్చిన చానూ కుటుంబ స్థితిని చూసి ఆతడు చాలా బాధపడ్డాడు. మాధవన్ లాగే ఎంతో మంది చాను ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయారు. మనం ఏదైనా పని చేయాలంటే సవాలక్ష వంకలు చెబుతాం. లేదంటే నాకు అది లేదు ఇది లేదు.. అంటూ సణుగుకుంటూ వెళ్తాము. కానీ చాను ఇంటి పరిస్థితిని చూసిన ఎంతో మంది.. జీవితంలో గెలవాలనే కోరిక ఉంటే మనకు ఉండే కష్టాలు, కన్నీళ్లు ఏనాడూ మనలను వెనక్కు నడిపించవు అని కామెంట్స్ చేస్తున్నారు.







    కాగా.. తాజాగా చాను కూడా ఒక ఫొటో షేర్ చేసింది. ఈ సారి తన గదిలో కింద కూర్చొని.. అన్నం కూరలు ఉన్న ఫొటోను దగ్గర నుంచి షేర్ చేసింది. ట్విట్టర్‌లో ఈ ఫొటో వైరల్‌గా మారింది. 'మొత్తానికి రెండేళ్ల తర్వాత హోమ్ ఫుడ్ తింటున్నాను' అంటూ సందేశాన్ని జత చేసింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Madhavan, Mirabai chanu, Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు