హోమ్ /వార్తలు /క్రీడలు /

విరాట్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా డివిలియర్స్!!

విరాట్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా డివిలియర్స్!!

ఏబీ డివిలియర్స్, విరాట్ కొహ్లీ (Twitter image)

ఏబీ డివిలియర్స్, విరాట్ కొహ్లీ (Twitter image)

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ స్థానంలో డాషింగ్ బ్యాటింగ్ ఏబీ డివిలియర్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించనుంది. బిజీ అంతర్జాతీయ షెడ్యూల్‌తో విరామం లేకుండా క్రికెట్ ఆడే విరాట్ కొహ్లీ స్థానంలో డివిలియర్స్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసి సత్ఫలితాలు రాబట్టాలని ఆర్‌సీబి యోచిస్తోంది.

ఇంకా చదవండి ...

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ టీమ్ కోసం భారీగా మార్పులు,చేర్పులు చేస్తోంది. ఇప్పటికే చీఫ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌‌‌ను నియమించిన రాయల్ చాలెంజర్స్ మేనేజ్‌మెంట్..కెప్టెన్‌ను సైతం మార్చాలని భావిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ స్థానంలో డాషింగ్ బ్యాటింగ్ ఏబీ డివిలియర్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించనుంది. సౌతాఫ్రికా సూపర్‌మేన్‌గా పేరున్న డివిలియర్స్ నాయకత్వంలో రాయల్ చాలెంజర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించగలదని టీమ్ యాజమాన్యం, మేనేజ్‌మెంట్ ధీమాగా ఉంది. టీమిండియా కెప్టెన్‌‌‌‌గా, కీలక బ్యాట్స్‌మెన్‌గా బిజీ అంతర్జాతీయ షెడ్యూల్‌తో విరామం లేకుండా క్రికెట్ ఆడే విరాట్ కొహ్లీ స్థానంలో డివిలియర్స్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసి సత్ఫలితాలు రాబట్టాలని ఆర్‌సీబి యోచిస్తోంది. డివిలియర్స్ ఎలాగూ ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి ట్వంటీ ట్వంటీ లీగ్‌ల్లో మాత్రమే కొనసాగుతానని ప్రకటించాడు. డివిలియర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా అపార అనుభవముంది. ఆర్‌సీబికి ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల్లో నాయకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా వెలుగొందుతున్న విరాట్‌ కొహ్లీ నుంచి రాయల్ చాలెంజర్స్ కెప్టెన్సీ భారాన్ని తొలగిస్తేనే....బ్యాటిం‌గ్‌‌‌లో బెంగళూర్‌కు తిరుగుండదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మాత్రమే. ప్రపంచస్థాయి ఆటగాళ్లతో పటిష్టమైన జట్టుతోనే గత 11 సీజన్లలో బరిలోకి దిగిన బెంగళూర్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేకపోయింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ టైటిల్ సొంతం చేసుకోలేదు. 2017 సీజన్‌లో ఫైనల్ వరకూ వచ్చిన విరాట్ సేన...సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి రన్నరప్ స్థానానికే పరిమితమైంది.11 సీజన్లలో మూడు సార్లు పైనల్ చేరినా...రాయల్ చాలెంజర్స్‌కు అదృష్టం కలిసి రాలేదు.
డివిలియర్స్ సారధ్యంలో రాయల్ చాలెంజర్స్ జట్టు చాంపియన్‌గా నిలిస్తే ఆ ఫ్రాంచైజీ అభిమానులకు అంచకు మించి కావాల్సిందేముంటుంది.

చీఫ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌‌‌‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా అశిష్ నెహ్రాను నియమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోన్న రాయల్ చాలెంజర్స్ ఫ్రాంచైజీకి 2019 సీజన్‌లో అయినా అద‌‌ృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్ ఆల్ టైమ్ ‌గ్రేట్ 'అలెస్టర్ కుక్‌'కు అరుదైన గౌరవం


VIDEO: అలెస్టర్‌ కుక్‌‌కు విరాట్ సేన గార్డ్ ఆఫ్ ఆనర్

First published:

Tags: Cricket, Team india, Virat kohli

ఉత్తమ కథలు