• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • AAKASH CHOPRAS IPL 2021 TEAM XI NO CHANCE TO VIRAT KOHLI MS DHONI JASPRIT BUMRAH SA

IPL 2021: కెప్టెన్‌గా పంత్‌.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్!

IPL 2021: కెప్టెన్‌గా పంత్‌.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్!

kohli rohith

మాజీ క్రికెటర్,విశ్లేషకులు ఆకాశ్ చోప్రా తన ఐపీఎల్ 2021 సీజన్ ప్లెయింగ్‌ ఎలెవెన్‌ జట్టులో టాప్ క్రికెటర్లకు చోటు దక్కలేదు

  • Share this:
    మాజీ క్రికెటర్,విశ్లేషకులు ఆకాశ్ చోప్రా తన ఐపీఎల్ 2021 సీజన్ ప్లెయింగ్‌ ఎలెవెన్‌ జట్టులో టాప్ క్రికెటర్లకు చోటు దక్కలేదు. ఎంఎస్‌ ధోని,విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలాంటి కీలక ఆటగాళ్ళకు తన ఎలెవెన్‌ జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆటగాళ్ళ ఆటతీరుకు ప్రమాణికంగా తీసుకుని ఆకాశ్ చోప్రా ఈ జట్టుని ఎంపిక చేశాడు. ఈ జట్టుకు సారథిగా రిషబ్‌ పంత్‌ ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను స్థానం కల్పించాడు. మూడో స్థానానికి డుప్లెసిస్‌‌కు అవకాశం ఇవ్వగా..గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, రిషబ్ పంత్‌ను మిడిలార్డర్‌లో చేర్చారు. ఇక ఆల్‌రౌండర్లగా రవీంద్ర జడేజా, క్రిస్ మోరిస్‌లను సెలెక్ట్‌ చేశాడు. బాలింగ్ ఢిపార్ట్‌మెంట్‌లో స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ని తీసుకొగా... పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్‌కి చోటిచ్చాడు.



    ఆకాష్ చోప్రా ఐపిఎల్ 2021 టీం ఎలెవన్: కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, క్రిస్ మోరిస్, రాహుల్ చాహర్, అవెష్ ఖాన్, హర్షల్ పటేల్
    Published by:Rekulapally Saichand
    First published: