Home /News /sports /

AAKASH CHOPRA SAYS RAHUL DRAVID HAS GREAT VISION AND HE CAN GOOD HEAD COACH FOR TEAM INDIA SRD

Rahul Dravid : " ద్రావిడ్ రూటే సపరేటు.. అతను పక్కా స్కెచ్ తో బరిలోకి దిగుతాడు "

Rahul Dravid

Rahul Dravid

Rahul Dravid : ఇక కోచ్‌ నియామక రేసులో ద్రావిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది. రవిశాస్త్రి స్థానంలో రాహుల్‌ నియామకం లాంఛనమే.

    మాజీ క్రికెటర్, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) టీమిండియా(Team India) హెడ్ కోచ్ (Head Coach) పోస్టుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రవిశాస్త్రి (Ravi Shastri) ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట కొనసాగించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మొదటి నుంచి అనిల్ కుంబ్లే (Anil Kumble) లేదా రాహుల్ ద్రావిడ్‌లలో ఒకరికి కోచ్ పదవి అప్పగించాలని భావించాడు. అయితే బోర్డు పెద్దలతో పాటు కొంత మంది టీమిండియా క్రికెటర్లలో అనిల్ కుంబ్లేపై విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఎన్ఏసీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ అదే పదవిలో కొనసాగుతానని ప్రకటించాడు. కానీ విదేశీ కోచ్ కంటే రాహుల్ ద్రావిడే సరైన వ్యక్తి అని భావించిన బీసీసీఐ అతడిని ఎట్టకేలకు ఒప్పించింది.

    ఇక కోచ్‌ నియామక రేసులో ద్రావిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది. రవిశాస్త్రి స్థానంలో రాహుల్‌ నియామకం లాంఛనమే. ఈ క్రమంలో టీమిండియాను విజయవంతంగా నడిపేందుకు బ్లూప్రింట్‌తో ద్రావిడ్‌ వస్తాడని మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ద్రావిడ్‌ కోచ్‌ పదవి చేపడితే దీర్ఘకాలం జట్టు విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాడని ఆకాష్ తెలిపాడు.

    తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ షోలో మాట్లాడుతూ... '" టీమిండియా కోసం రాహుల్‌ ద్రావిడ్ ఒక ప్రాసెస్‌ను ప్రవేశపెడతాడు. ద్రవిడ్ ఎంపికైతే.. ఐదేళ్లకు గానూ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుని వస్తాడు. స్వల్ప వ్యవధి కోసం కాకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలతో రావొచ్చు'" అని అన్నాడు.

    విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో రాహుల్ ద్రవిడ్‌ కాంబినేషన్‌ చాలా ఆసక్తిగా ఉంటుందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. " త్వరలోనే టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ-రాహుల్ ద్రవిడ్‌, టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీతో జట్టు కట్టడం చూడబోతున్నాం. ఇది చాలా ఉత్తేజభరితంగా ఉండబోతుంది. అధికారికంగా ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. కాబట్టి ఇతర దరఖాస్తులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదు. ద్రవిడ్ రాకకోసం నేను మాత్రమే కాదు అందరూ ఎదురుచూస్తున్నారు " అని ఆకాశ్‌ చోప్రా చెప్పాడు.

    ఇది కూడా చదవండి : క్రేజ్ కా బాప్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రొనాల్డో పోస్ట్.. రికార్డులన్నీ బ్రేక్..

    జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా, అండర్‌-19 జట్టు కోచ్‌గా ఇప్పటికే ద్రeవిడ్‌ ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు దిగ్గజ బ్యాట్స్​మన్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Rahul dravid, Rohit sharma, Sourav Ganguly, Team india, Virat kohli, VVS Laxman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు