క్రీడలు

  • associate partner

ఆ మూడు జట్లకు దుబాయ్ అనుకూలం.. ఆర్సీబీకి మాత్రం ఫుల్ అడ్వాంటేజ్

ఐపీఎల్ యూఏఈలో జరగడం వల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదన్నారు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. కాకపోతే అక్కడి వాతావరణం పరిస్థితులను తట్టుకోవడమే కొంచం కష్టామన్నారు.

Rekulapally Saichand
Updated: July 22, 2020, 6:25 PM IST
ఆ మూడు జట్లకు దుబాయ్ అనుకూలం.. ఆర్సీబీకి మాత్రం ఫుల్ అడ్వాంటేజ్
విరాట్ కోహ్లీ
  • Share this:
ఐపీఎల్ యూఏఈలో జరగడం వల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదన్నారు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. కాకపోతే అక్కడి వాతావరణం పరిస్థితులను తట్టుకోవడమే కొంచం కష్టామన్నారు. తన యూట్యూబ్‌ ఛానల్లో పలు విషయాలను మాట్లాడుతూ " యూఏఈ వాతావారణం పరిస్థితులు ఆటగాళ్ళకు సవాలుగా మారోచ్చు. అక్కడి వేడి తట్టుకోవడం కష్టమే. కానీ సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో నేలలో వాతావరణం కొంత చల్లగానే ఉంటుంది. సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితులలో ఈవెంట్ తొందరగా ముగించాలంటే రెండు మ్యా్చ్‌లు నిర్వహించక తప్పదు. ముఖ్యంగా సాయంత్రం నిర్వహించే వల్ల ఆటగాళ్ళుకు డీహైడ్రేట్‌ అయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు" అకాశ్

"అలాగే ఆర్‌సీబీ, చెన్నై, పంజాబ్‌ వంటి జట్లు యూఏఈలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూఏఈ మైదానాలలో బ్యాటింగ్ ప్రభావం ఎక్కువగా ఉండదు. అయితే కొన్ని జట్లు అక్కడి రాణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి మైదానాలు పెద్దగా ఉంటాయి కాబట్టి బౌలింగ్‌లో బలహీనంగా ఉన్న ఆర్సీబీ జట్టుకు ఇది అనుకూలించే అంశం. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టుకు ఇది అడ్వాటెంజ్. ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కూ కూడా ఇక్కడ రాణించ అవకాశాలు ఉన్నట్లు" తెలిపారు ఆకాశ్.
Published by: Rekulapally Saichand
First published: July 22, 2020, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading