గంగూలీ, ధోనీ ఎవరు గొప్ప?.. మాజీ ఆటగాళ్ళ మధ్య ఆసక్తికర చర్చ

గంగూలీ, ధోనీ ఈ ఇద్దరూ మాజీ సారథులు ప్రపంచ క్రికెట్ యవ్వనికపై భారత జట్టును ఉన్నత శిఖరాలలో నిలబెట్టారు. అయితే వీరిద్దరిలో ఎవరు గొప్ప సారథి అని చేప్సడం చాలా కష్టం. కానీ తాజాగా గౌతమ్ గంభీర్‌ ఎవరిది గొప్ప నాయకత్వం అనే దానిపై స్పందించారు.

Rekulapally Saichand
Updated: July 17, 2020, 6:21 PM IST
గంగూలీ, ధోనీ ఎవరు గొప్ప?.. మాజీ ఆటగాళ్ళ మధ్య ఆసక్తికర చర్చ
గంగూలీ, ధోని, కోహ్లీ
  • Share this:
గంగూలీ, ధోనీ ఈ ఇద్దరూ మాజీ సారథులు ప్రపంచ క్రికెట్ యవ్వనికపై భారత జట్టును ఉన్నత శిఖరాలలో నిలబెట్టారు. అయితే వీరిద్దరిలో ఎవరు గొప్ప సారథి అని చేప్సడం చాలా కష్టం. కానీ తాజాగా గౌతమ్ గంభీర్‌ ఎవరిది గొప్ప నాయకత్వం అనే దానిపై స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మ్యాచ్‌ విన్నర్లను గంగూలీ తీసుకొచ్చినంతగా ధోనీ తీసుకురాలేకపోయాడన్నారు. ఎమ్ఎస్ సారథ్యంలో కోహ్లీ, రోహిత్‌, బుమ్రాలు లాంటి ఫ్లేయర్లు తప్ప మరో ఆటగాళ్ళు ఎవరు రాలేదన్నారు.

అయితే గాంభీర్ అభిప్రాయాన్ని ఖండించారు ఆకాశ్‌చోప్రా. తన సొంత యూట్యూబ్ ఛానల్‌ల్లో మాట్లాడుతూ " ధోనీ గొప్ప సారథి.. టీమిండియాను తీర్చిదిద్దాడంలో ఎమ్ఎస్ పాత్ర మరవలేనిది అన్నారు. 2017లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని కోహ్లీకి అప్పగించాడు. స్ఫూర్తిధాయకమైన నాయకత్వంతో ఇటూ యువ అటూ దిగ్గజ ఆటగాళ్లను చూసుకున్నారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్ళ మనోభవాలను దెబ్బతీయకుండా యువ క్రికెటర్లను ప్రోత్సహించడన్నారు"

అలాగే గంగూలీ సారధ్యపై కూడా చోప్రా స్పందించారు. గంగూలీ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యాలను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశాలిచ్చి వారిని ప్రోత్సహించాడని స్పష్టంచేశాడు. భారత క్రికెట్ చరిత్రలో గంగూలీది చేరగని ముద్ర వేశాడన్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 17, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading