హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli Out : ద్యావుడా.. ఇదెక్కడి మాయ రా మామ.. పది గంటల ముందే కోహ్లీ ఎలా ఔట్ అవుతాడో చెప్పేశాడు..!

Virat Kohli Out : ద్యావుడా.. ఇదెక్కడి మాయ రా మామ.. పది గంటల ముందే కోహ్లీ ఎలా ఔట్ అవుతాడో చెప్పేశాడు..!

Virat Kohli Out : మనం జోఫ్రా ఆర్చర్ జోతిష్య ట్వీట్స్ చూశాం. ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ అప్పుడు ఆక్టోపస్ ప్రెడిక్షన్ చూశాం. కానీ.. ఓ ట్విట్టర్ యూజర్ విరాట్ కోహ్లీ విషయంలో ప్రిడిక్ట్ చేసిన విధానం చేస్తే నోరెళ్లపెట్టడం ఖాయం.

  మొహాలీ వేదికగా వందో టెస్ట్ ఆడుతున్న కోహ్లి(Virat Kohli) సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మైల్ స్టోన్ మ్యాచులో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న.. విరాట్ కోహ్లీని లసిత్ ఎంబుల్దెనియా బోల్తా కొట్టించాడు. విరాట్ కోహ్లీ(76 బంతుల్లో 45 పరుగులు) చేసి లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో కోహ్లి క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో.. ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే.. మొహాలీ టెస్ట్ కు సరిగ్గా పది గంటల ముందు అంటే నిన్న ఓ ట్విట్టర్ యూజర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తును చెప్పేశాడు. విరాట్ కోహ్లీ భవిష్యత్తు చెప్పడమేంటి అనుకుంటున్నారా.. ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్.. కోహ్లి ఎన్ని పరుగులు చేస్తాడు..? ఎవరు ఔట్ చేస్తారు...? అనేది అంచనా వేశాడు. అదేం మాయో గానీ.. కోహ్లీ అతని చెప్పినట్టుగానే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఔటవ్వడంతో ఇప్పుడు ఆ యూజర్ ట్వీట్ వైరల్ అవుతుంది.

  సదరు ట్వీట్ కు సంబంధించి.. శృతి#100 అనే ప్రొఫైల్ పేరుతో ఉన్న ఓ యూజర్ శుక్రవారం వేకువ జామున 12.46 గంటలకు ఓ ట్వీట్ చేశాడు. అందులో "కోహ్లి తన వందో టెస్టులో వంద పరుగులు చేయడు. అతడు 45 పరుగులు చేస్తాడు. అందులో నాలుగు కళ్లు చెదిరిపోయే కవర్ డ్రైవ్ ఫోర్లు ఉంటాయి. లంక బౌలర్ ఎంబుల్డెనియా బౌలింగ్ లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అవుతాడు. దాంతో అతడు షాక్ కు గురవుతాడు. " అని ట్వీట్ లో పేర్కొన్నారు.

  ఆ ట్విట్టర్ యూజర్ చెప్పినట్టే.. ఈ మ్యాచులో కోహ్లి 45 పరుగులే చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ట్వీట్ లో పేర్కొన్నట్టుగా.. 4 ఫోర్లు కాకుండా కోహ్లి 5 ఫోర్లు కొట్టాడు. అయితే ఎంబుల్డెనియా బౌలింగ్ లోనే కోహ్లి బౌల్డ్ అవడం విశేషం. 100 బంతులు కాకుండా.. 76 బాల్స్ మాత్రమే ఆడతాడు. కానీ.. అదే స్కోర్.. అదే బౌలర్.. ఔటైన తీరు చెప్పడం మాత్రం విచిత్రంగానే చెప్పుకోవచ్చు.

  ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాక్షాత్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ ట్వీట్ చూసి నోరెళ్లబెట్టాడు. ఇదే విషయమై పలువురు నెటిజన్లు కూడా షాక్ లో ఉన్నారు. "ఎవరు ఔట్ చేస్తారనేది అంచనా వేయడం ఓకే. కానీ స్కోర్ కూడా అంత కచ్చితంగా ఎలా..? ఈ సీక్రెట్ ఏదో మాకూ చెప్పరాదు..." అని కామెంట్ చేశాడు.

  ఇక, తన మైల్ స్టోన్ మ్యాచులో కోహ్లీ అద్భుత రికార్డును కైవసం చేసుకున్నాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్ట్ కెరీర్ లో 8 వేల పరుగుల మైల్ స్టోన్ ని అందుకున్నాడు. కోహ్లీ ఈ ఫీట్ ను 169 ఇన్నింగ్స్ ల్లోనే అందుకోవడం విశేషం. 8 వేల పరుగుల మార్క్ ను అందుకున్న ఆరో ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ. విరాట్ కంటే ముందు సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు.

  First published:

  Tags: India vs srilanka, VIRAL NEWS, Virat kohli

  ఉత్తమ కథలు