భారత్‌లో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (Major Dhyanchand Khel ratna) అవార్డు తో పాటు అర్జున (Arjuna) అవార్డులకు పలువురు అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ ఇంతకుముందే నామినేట్ చేసింది. ఈ జాబితాలో టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics), పారాలింపిక్స్ (Paralympics) లో అదరగొట్టిన క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. ఈ నవంబర్ 13న న్యూఢిల్లీలో మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డులకు గానూ మొత్తం 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj chopra) కూడా ఉన్నారు. ఇక రవి దహియా.. హాకీ క్రీడాకారులు మన్ప్రీజ్ సింగ్, పీఆర్ శ్రీజేష్, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (mitali raj) ఉన్నారు.
ఆగస్టు 29నే ఇవ్వాలి కానీ..
సాధారణంగా ప్రతి ఏడాది క్రీడా అవార్డులను జాతీయ క్రీడా దినోత్సవమైన (national sports day) ఆగస్టు 29 (ధ్యాన్ చంద్ పుట్టినరోజు) న అందజేస్తారు. కానీ ఈసారి టోక్యో ఒలింపిక్స్ (tokya olypmics) తో పాటు పారాలింపిక్స్ కూడా ఉండటంతో అవి ముగిసిన తర్వాత అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతకుముందే భారత ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పేరిట ఉన్న ఖేల్ రత్న (khel ratna) అవార్డును ధ్యాన్ చంద్ గా మార్చింది.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు కు గాను 12 మందిని (12 Members) ఎంపిక చేశారు. వారు వరుసగా.. టోక్యో ఒలింపిక్స్లో భారత స్వర్ణ పతక కాంక్ష నెరవేర్చిన నీరజ్ చోప్రా (Neeraj chopra)తో పాటు రవి దహియా (రెజ్లింగ్-రజతం), పీఆర్ శ్రీజేష్, మన్‌ప్రీత్‌సింగ్ (హాకీ- కాంస్యం), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్- కాంస్యం) ఉన్నారు. సునీల్ ఛైత్రి (ఫుట్బాల్), మిథాలీ రాజ్ (క్రికెట్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), సుమిత్ యాంటిల్ (అథ్లెటిక్స్), అవని లేఖ (షూటింగ్), కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్) ఉన్నారు.
National Sports Award will be given in New Delhi on November 13. Major Dhyan Chand Khel Ratna Award will be given to 12 sportspersons including Neeraj Chopra (Athletics), Ravi Kumar (Wrestling), Lovlina Borgohain (Boxing) and Sreejesh PR (Hockey) pic.twitter.com/40p0mj6hsU
— ANI (@ANI) November 2, 2021
ఇక అర్జున అవార్డులకు నామినేట్ అయిన జాబితాలో..
యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), నిషధ్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), సుహాస్ (బ్యాడ్మింటన్), సింగ్రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ) శిఖర్ ధావన్ (క్రికెట్) తో పాటు మరో 26 మంది కూడా జాబితాలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Games, Hockey, National Awards, New Delhi, Sports, Tokyo Olympics