Home /News /sports /

A STAMPEDE BROKE OUT AT GYMKHANA GROUND AFTER A HUGE CROWD OF CRICKET FANS GATHERED THERE TO GET TICKETS FOR INDVSAUS SK

IND vs AUS T20 Match: జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తొక్కిసలాటలో పలువురు క్రికెట్ ఫ్యాన్స్‌కి గాయాలు

జింఖానా వద్ద తొక్కిసలాట

జింఖానా వద్ద తొక్కిసలాట

Gymkhana Ground: టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారని అంచనాలున్నా.. అందుకు తగ్గట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరైన ఏర్పాట్లు చేయలేదు. టికెట్ల విక్రయాల్లో దారుణంగా విఫలమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ ( Secunderabad Gymkhana Ground) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం హైదరాబాద్‌ (Hyderabad)లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ (IND vs AUS Match) టికెట్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. జనాలు ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో రావడంతో తోపులాట జరిగి.. తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వారిలో ఎనిమిది మందిని పోలీసులు యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇంకా భారీ సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీచార్జ్ కూడా చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌లో కూడా పలువురు గాయపడ్డారు. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు .. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారని అంచనాలున్నా.. అందుకు తగ్గట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరైన ఏర్పాట్లు చేయలేదు. టికెట్ల విక్రయాల్లో దారుణంగా విఫలమైంది. దాదాపు 10 వేల మంది టికెట్ల కోసం వస్తే.. వారికి కేవలం నాలుగు క్యూలైన్లు మాత్రమే పెట్టారు. అందులోనూ నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ లేదు. మహిళలకు ప్రత్యేక కౌంటర్ లేదు. వేలాది టికెట్లను ఒక్క గ్రౌండ్‌లోనే విక్రయించడమేంటని.. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో అమ్మవచ్చు కదా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. HCA నిర్లక్ష్యం వల్లే.. అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసులు కూడా తెలిపారు. నిర్వహణా లోపం కారణంగానే.. పరిస్థితులు అదుపుతప్పాయని వెల్లడించారు. హెచ్‌సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవానికి సెప్టెంబరు 15నే పేటీఎంలో ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచింది హెచ్‌సీఏ. కానీ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయి. బుక్ అయిన వారి టికెట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అభిమానులు ఆఫ్‌లైన్‌లో టికెట్లను కొనేందుకు గత ఐదారు రోజులుగా ఉప్పల్ స్టేడియం చుట్టూ తిరగుతున్నారు. కానీ అక్కడి అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. జింఖానా గ్రౌండ్‌లో ఇస్తారని చెప్పారు. అక్కడ కూడా టికెట్లను ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని.. హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్లను విక్రయిస్తారని హెచ్‌సీఏ చెప్పడంతో.. అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు పోటెత్తారు. ఐతే సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. టికెట్ల అమ్మకాల్లో హెచ్‌సీఏ ఘోరంగా విఫలమైందని సర్వత్రా విమర్శలు వెల్లువస్తున్నాయి. సినిమా షోల నుంచి కామెడీ షోల వరకు అన్ని.. ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి.. కానీ క్రికెట్ టికెట్లు మాత్రం ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టలేదని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. టికెట్లతో బ్లాక్ దందా చేసేందుకే.. ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Hyderabad, IND vs AUS, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు