హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : క్రికెట్ గ్రౌండ్ లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ ఫీల్డర్లు.. చివరికి..

Viral Video : క్రికెట్ గ్రౌండ్ లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ ఫీల్డర్లు.. చివరికి..

image Credit : Twitter

image Credit : Twitter

Viral Video : వింతలు-విశేషాలకు సోషల్ మీడియా (Social Media) నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి.

వింతలు-విశేషాలకు సోషల్ మీడియా (Social Media) నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. కానీ, అప్పడప్పుడూ మన మధ్య జరిగే కొన్ని అరుదైన దృశ్యాలు చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ ఘటన ఇంగ్లండ్ పొరుగు దేశంలో ఐర్లాండ్ లో జరిగింది. అది కూడా క్రికెట్ మైదానంలో జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అందమైన కుక్కపిల్ల మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి ప్లేయర్లందరికీ చుక్కలు చూపెట్టింది. అంతేకాక వారి చేత పరుగులు పెట్టించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మహిళల దేశీయ టి 20 టోర్నమెంట్ ‘ఆల్ ఐర్లాండ్ టి 20 కప్’ జరుగుతోంది. దీని సెమీ-ఫైనల్ మ్యాచ్ శనివారం 11 సెప్టెంబర్‌లో జరిగింది. ఫైనల్‌లో బెర్త్‌ కోసం బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ సివిల్ సర్వీస్ నార్త్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బైర్డీ క్లబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. జట్టు తరఫున డెల్జైల్ అత్యధికంగా 47 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న సివిల్ సర్వీసెస్ నార్త్ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక ఫన్నీ సంఘటన జరిగింది.

ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌లో సివిల్ సర్వీస్ బ్యాటర్ బంతిని స్క్వేర్‌గా కట్ చేయగా.. బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్తోంది. ఫీల్డర్ బంతిని పట్టుకుని కీపర్ వైపు విసురుతోంది . ఆ కీపర్ రనౌట్ చేసే ప్రయత్నంలో బంతిని స్టంప్స్ వైపు కొట్టింది. బంతి స్టంప్స్‌ని తాకలేదు కానీ ఈ సమయంలో ఒక చిన్న కుక్క మైదానంలోకి ప్రవేశించింది. బంతిని నోటిలో పట్టుకొని రేసును ప్రారంభించింది.

గ్రౌండ్‌లోని ఫీల్డర్లు బంతిని తేవడానికి కుక్క వెంట పరుగెత్తుతారు. కానీ అది వారిని తప్పించుకుంటూ పరుగులు పెడుతుంది. కొంతసేపటి తర్వాత కుక్కను ఆపి బంతిని తీసుకొని వెళ్తారు. ఈ సమయంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి కుక్క పిల్లని తీసుకొని వెళుతాడు. మ్యాచ్ సమయంలో జరిగిన ఈ సంఘటన అందరినీ అలరించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

First published:

Tags: Cricket, Trending, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు