విషాదం: మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపాటు.. ఆటగాడు మృతి..

మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిడుగుపడి.. ఓ ఆటగాడు మరణించాడు. మరో నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: September 20, 2020, 3:17 PM IST
విషాదం: మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపాటు.. ఆటగాడు మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిడుగుపడి.. ఓ ఆటగాడు మరణించాడు. మరో నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుమ్లా జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఊరు బార్ది గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పిడుగుపాటు వల్ల చనిపోయిన ఆటగాడిని తేతార్ టోలి గ్రామానికి చెందిన పరాస్ పన్నాగా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి చైన్‌పూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కుల్తీప్ కుమార్ మాట్లాడుతూ.. నేమాన్ కుజుర్ చాంపిషయన్ షిప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో పిడుగుపడిందని తెలిపారు. మొత్తం ఐదుగురు గాయపడటంతో వారిని గుమ్లా సర్ధార్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే అందులో ఒక్కరు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని.. మిగతా నలుగురికి మాత్రం చిన్నపాటి గాయాలు అయ్యాయని వెల్లడించారు. అలాగే లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఎలా నిర్వహించారనే దానిపై విచారణ చేపట్టామని తెలిపారు. త్వరలోనే మ్యాచ్ నిర్వహకులను అదుపులోకి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ ఘటనలో గాయపడిన ఓ ఆటగాడు మాట్లాడుతూ.. వర్షం పడుతున్నప్పటికీ మ్యాచ్ కొనసాగించామని.. అయితే ఒక్కసారిగా గ్రౌండ్ మధ్యలో పిడుగు పడటంతో ఒక ఆటగాడు చనిపోయాడని తెలిపాడు.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading