ఇండియాను క్రికెట్‌ను (Cricket) విడదీసి చూడంలే. మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతం (Religion) లాంటిది. ఎంతో మంది క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని క్రికెట్ మార్కెట్ మన దగ్గర ఉన్నది. దీనంతటికీ బీజం పడింది ఎప్పుడో తెలుసా? 1983 వన్డే వరల్డ్ కప్ (1983 ODI World Cup). అసలు ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా వెళ్లిన భారత జట్టు (Team India) వరల్డ్ కప్ గెలిచి కపిల్ డెవిల్స్‌లా (Kapil Devils) మారిపోయింది. ఇప్పటికీ భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయాల్లో అగ్రస్థానంలో ఉండేది లార్డ్స్‌లో భారత జట్టు ప్రపంచ కప్ గెలవడమే. 1983లో కపిల్ దేవ్ (Kapil Dev) సారథ్యంలో ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ.. ఏకంగా విశ్వవిజేతగా మారిపోవడం ఇప్పటికీ మన పెద్దలు కథలుగా చెబుతుంటారు. అయితే ఆ కథనే ఇప్పటి తరానికి అందించాలనే ఉద్దేశంతో బాలీవుడ్లో '83' అనే సినిమాను రూపొందించారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ నటించిన ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలై అందరినీ ఆకట్టుకున్నది.
ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఒకటి అందరినీ ఆకట్టుకుంటున్నది. 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ - ఇండియా మధ్య జరిగింది. ఆనాడు ఆ మ్యాచ్ ఆడిన క్రికెటర్ల కొడుకులు కొందరు ఈ సినిమాలు నటించారు. విశేషం ఏంటంటే ఆ వారసులు తమ తండ్రుల పాత్రల్లో నటించారు. కపిల్ దేవ్ పాత్రలో అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించాడు. ఇక క్రికెటర్ సందీప్ పాటిల్ పాత్రను అతని కొడుకు చిరాగ్ పాటిల్ పోషిస్తున్నాడు. వరల్డ్ కప్ సమయంలో రిబ్స్ విరిగి పోయినా మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 51 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
వెస్టిండీస్ జట్టులోని ఓపెనర్ గోర్డన్ గ్రీనిడ్జ్ పాత్రను అతని కుమారుడు కార్ల్ గ్రీనిడ్జ్ పోషించాడు. కార్ల్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు నటుడు కూడా. దీంతో తండ్రి పాత్రను అలవోకగా పోషించాడు. విండీస్ ఫాస్ట్ బౌలర్ మాల్కమ్ మార్షల్ పాత్రను కొడుకు మాలి మార్షల్ పోషించాడు. 1983లో విండీస్ కెప్టెన్ క్లయివ్ లాయిడ్ కొడుకు జాసన్ లాయిడ్ కూడా ఈ సినిమాలు ఒక పాత్రలో నటించాడు. అయితే తండ్రి పాత్రలో కాకుండా ఫాస్ట్ బౌలర్ జోయల్ గార్నర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎందుకంటే జోయల్ గార్నర్ చాలా ఎత్తుగా ఉంటాడు. దీంతో ఆరున్నర అడుగు ఉండే జాసన్ లాయిడ్‌ను గార్నర్ పాత్రకు ఎంపిక చేశారు. అదే విధంగా ఈ సినిమాలో లారో గోమ్స్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా క్రికెటర్ కొడుకే. విండీస్ మాజీ స్టార్ ప్లేయర్ శివనారాయణ్ చందర్‌పాల్ కొడుకు ఈ పాత్రలో నటించినట్లు సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 83 Biopic, Kapil Dev, Team India