#5MinuteAur: కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సరికొత్త ఛాలెంజ్

#5MinuteAur challenge | కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మరో ఛాలెంజ్‌తో నెటిజన్ల ముందుకొచ్చారు. #5MinuteAur, #KheloIndia పేరుతో ఆటలు ఆడాలని ఛాలెంజ్ విసిరారు.

news18-telugu
Updated: January 9, 2019, 4:39 PM IST
#5MinuteAur: కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సరికొత్త ఛాలెంజ్
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
news18-telugu
Updated: January 9, 2019, 4:39 PM IST
ఫిట్‌నెస్ ఛాలెంజ్‌తో సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... తాజాగా మరో ఛాలెంజ్‌తో నెటిజన్ల ముందుకొచ్చారు. #5MinuteAur, #KheloIndia పేరుతో ఆటలు ఆడండని ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వాళ్లంతా #5MinuteAur, #KheloIndia పేరుతో వీడియోలు పోస్ట్ చేయాలని సూచించారు. చిన్నతనంలో మరింతగా ఆడుకోవాలని ఆశపడే పిల్లలకు అండగా ఉండాలని సూచించారు. విరాట్ కొహ్లి, సల్మాన్ ఖాన్, సైనా నెహ్వాల్, దీపికా పదుకొణెలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు కేంద్రమంత్రి రాథోడ్.



గతంలో ఇండియా అంతా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసిరారు. ఇందుకు స్పందించిన సెలబ్రిటీలు, నెటిజన్లు తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ సైతం తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మరి... గతంలో ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ విసిరి సూపర్ సక్సెస్ సాధించిన కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్... ఈ సారి #5MinuteAur, #KheloIndia ఛాలెంజ్‌తో ఎంతమేరకు నెటిజన్లను ప్రభావితం చేస్తారో చూడాలి.

First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు