5 MIN ME ENGLISH KHATAM HO JAYEGI AFGHAN CRICKET CAPTAIN MOHAMMAD NABI HILARIOUS VIDEO GOES VIRAL JNK
Nabi English: 'నా వల్ల కాదు.. 5 నిమిషాల్లో నా ఇంగ్లీష్ ఖతమ్'.. నవ్వులు పూయించిన నబి - Video
నవ్వులు పూయించిన మహ్మద్ నబి వ్యాఖ్యలు - Video
Mohammad Nabi English : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా విలేకరుల సమావేశానికి వచ్చిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబి ఇంగ్లీష్ గురించి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్టు కెప్టెన్ మహ్మద్ నబి (Mohammad Nabi) విలేకరుల సమావేశంలో నవ్వులు పూయించాడు. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో (PAkistan) జరిగిన మ్యాచ్‌కు రెండు రోజుల ముందు మహ్మద్ నబి విలేకరుల సమావేశానికి హాజరయ్యాడు. అక్కడి రావడంతోనే చాలా కంగారుగా ఉన్న మహ్మద్ నబి.. 'ఇది చాలా కష్టమైన పని నా వల్ల కాదు' అంటూ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని అడిగాడు. కోఆర్డినేటర్ చెప్పిన సమాధానానికి.. 'నా ఇంగ్లీష్ ఐదు నిమిషాల్లో ఖతమ్ అవుతుంది' అని అన్నాడు. దీంతో విలేకరుల సమావేశంలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఇక విలేకరుల సమావేశం ప్రారంభించిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఒక్కోసారి ఇంగ్లీషులో మరోసారి హిందీలో కూడా సమాధానం ఇస్తూ వచ్చాడు.
మహ్మద్ నబిని విలేకరులు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు బలబలహీనతలతో పాటు.. ప్రస్తుతం వారి దేశంలోని పరిస్థితుల గురించి కూడా ప్రశ్నించారు. నబి చాలా ఓపికగా అన్నింటికీ సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 130 పరుగుల భారీ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు జరిగిన జాతీయ గీతాలాపనలో మహ్మద్ నబి కన్నీటి పర్యంతం అయ్యాడు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను గుర్తు చేసుకొని.. ఒక అంతర్జాతీయ టోర్నీ ఆడటానికి వచ్చినందుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 5 వికెట్లు తేడాతో ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసి తడబడినా.. మహ్మద్ నబి, గుల్బాదిన్లు కలసి ఆఖర్లో వీరోచిత పోరాటం చేశారు. దీంతో అఫ్గానిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు కూడా తడబడింది. ఆఖర్లో అఫ్గానిస్తాన్ దాదాపు గెలిచినంత పని చేసింది. అయితే పాక్ బ్యాటర్ అలీ ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాది మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నది.
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 2లో పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ చేయడం దాదాపు ఖరారయ్యింది. అఫ్గానిస్తాన్ 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా, న్యూజీలాండ్ జట్లు ఒక్కో పరాజయంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య కీలకమైన పోరు జరుగనున్నది. దాంట్లో విజయం సాధించిన జట్టుకే సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.