Home /News /sports /

5 BATTERS SCORED ODI RUNS 2021 FULL DETAILS HERE GH VB

Most ODI Runs: 2021లో అత్యధిక పరుగులు చేసిన టాప్​ 5 బ్యాట్స్​మెన్లు వీరే.. ఎవరెన్ని పరుగులు చేశారంటే?

క్రికెటర్స్

క్రికెటర్స్

2021లో క్రికెట్​ చరిత్రలో నమోదైన రికార్డుల (Cricket records) గురించి అభిమానులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఆటగాళ్ల వారీగా రికార్డులు, వారు చేసిన పరుగులను లెక్కగడుతున్నారు.

2021 సంవత్సరం(Year 2021) ముగింపుకు చేరుకున్నాం. మరొక్క రోజులో 2021కి గుడ్​బై చెప్పి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021లో క్రికెట్​ చరిత్రలో నమోదైన రికార్డుల (Cricket records) గురించి అభిమానులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఆటగాళ్ల వారీగా రికార్డులు(Records), వారు చేసిన పరుగులను లెక్కగడుతున్నారు. 2021 ఏడాదికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, ఈ ఏడాదే ఐసీసీ టీ 20 (ICC T20) ప్రపంచకప్​ జరిగింది. ఆస్ట్రేలియా(Australia) ఐసీసీ టీ 20 వరల్డ్​ కప్(ICC T20 World Cup)​ నెగ్గి చరిత్ర సృష్టించింది. అయితే, ఆస్ట్రేలియా ఈ సంవత్సరం కేవలం మూడు వన్​ డే ఇంటర్నేషనల్​ (ODI)లు మాత్రమే ఆడింది. ఇదే సమయంలో భారత్​ ఆరు వన్డేలు ఆడింది.

ఇక, 2021లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు మాత్రమే పదికి పైగా ఓడీఐ గేమ్‌లు ఆడాయి. కరోనా మహమ్మారి కారణంగా డిసెంబర్‌లో జరగాల్సిన పాకిస్తాన్ vs వెస్టిండీస్, ఐర్లాండ్ vs యూఎస్​ఏ వన్డే సిరీస్‌లు రద్దయ్యాయి. ఈ ఏడాది జరిగిన వన్డే సిరీస్​లలో అత్యధిక పరుగులు చేసిన టాప్​ 5 ఆటగాళ్లను పరిశీలిద్దాం.

1. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) – 705
ఐర్లాండ్ ఆల్ రౌండర్ పాల్ స్టిర్లింగ్ ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈ రైట్​ హ్యాండ్ బ్యాట్స్​మెన్​ మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో 54.23 సగటుతో 705 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్​ వన్డే క్రికెట్‌లో మొత్తం మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

2. జన్నెమన్ మలన్ (దక్షిణాఫ్రికా) – 509
దక్షిణాఫ్రికా రైజింగ్ స్టార్ జన్నెమాన్ మలన్ ఈ ఏడాది వన్డే ఇంటర్నేషనల్​ మ్యాచ్‌లో తన అద్భుతమమైన ఆటతీరుతో బాగా ఆకట్టుకున్నాడు. 25 ఏళ్ల మలన్​ కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో 84.83 సగటుతో 509 పరుగులు చేశాడు. ఈ ఏడాది మలన్ మొత్తం రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. 2022 ప్రారంభంలో భారత్‌తో జరగనున్న సిరీస్‌లో ఇదే ఫామ్​ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.








Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి






Janneman Malan (@j_malan_18) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






3. తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)- 464
ఆసియా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ 2021లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్​కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు 38.66 సగటుతో 12 ఇన్నింగ్స్‌లలో 464 పరుగులు చేశాడు. తమీమ్​ ఇక్బాల్ ఈ సంవత్సరంలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.

4. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 454
హ్యారీ టెక్టర్ 2021లో ఒక్క వన్డే మ్యాచ్​లో కూడా సెంచరీ చేయలేదు. అయితే పరుగుల స్కోరింగ్ లీడర్‌ బోర్డ్‌లో మాత్రం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాడు. డబ్లిన్‌కు చెందిన 22 ఏళ్ల హ్యారీ టెక్టర్​ ఐర్లాండ్ తరపున 14 వన్డే మ్యాచ్​లలో ఆడాడు. 75.66 స్ట్రైక్ రేట్‌తో 454 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం టెక్టర్ చేసిన అత్యధిక స్కోరు 79.



5. ఆండీ బాల్బిర్నీ (ఐర్లాండ్) – 421
ఐర్లాండ్ కెప్టెన్ ఆండీ బల్బిర్నీ ఈ ఏడాది మంచి ఫామ్​లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. అతను ఆడిన 14 వన్డే ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 421 పరుగులు చేశాడు. ఈ రైట్​ హ్యాండ్ బ్యాట్స్​మెన్​ 2021లో 32.38 బ్యాటింగ్ రన్​రేటు, 71.96 స్ట్రైక్ రేట్ సాధించాడు.
Published by:Veera Babu
First published:

Tags: Cricket, ODI Rankings

తదుపరి వార్తలు