హోమ్ /వార్తలు /క్రీడలు /

బీసీసీఐకి మేలు చేసిన కరోనా.. తగ్గిన ఖర్చు.. పెరిగిన ఆదాయం

బీసీసీఐకి మేలు చేసిన కరోనా.. తగ్గిన ఖర్చు.. పెరిగిన ఆదాయం

bcci vs star sports

bcci vs star sports

కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లోనూ ఐపిఎల్–2020 ను విజయవంతంగా నిర్వహించింది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ). ఇప్పటివరకు నిర్వహించిన సీజన్లలో బీసీసీఐకి అతిపెద్ద విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.

కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లోనూ ఐపిఎల్–2020 ను విజయవంతంగా నిర్వహించింది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ). ఇప్పటివరకు నిర్వహించిన సీజన్లలో బీసీసీఐకి అతిపెద్ద విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. తొలుత మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్–13 సీజన్ను కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేసింది బిసిసిఐ. చివరికి అది సెప్టెంబర్ 19న యుఏఈలో ప్రారంభమైంది. అయితే, కరోనా కష్ట కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది ఈ ఐపీఎల్ సీజన్. యూఏఈ వేదికగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్–13వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బీసీసీఐ బోర్డు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. దీనికి అదనంగా, ఐపిఎల్–2019 తో పోల్చితే ఈసారి టీవీ వ్యూయర్ షిప్ 25 శాతం పెరిగింది. మొత్తం 53 రోజుల వ్యవధిలో జరిగిన 60 మ్యాచ్‌ల మెగా టోర్నమెంట్‌లో 1,800 మందికి 30 వేల మేర కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్–19తో ప్రేక్షకులు లేకపోవడం మూలాన గత ఐపిఎల్‌తో పోలిస్తే బోర్డు దాదాపు 35 శాతం ఖర్చును తగ్గించగలిగింది.

25 శాతం మేర పెరిగిన వ్యూయర్షిప్..

దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధమాల్ మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి కష్ట కాలంలోనూ మేము రూ .4,000 కోట్లు సంపాదించాము. క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగింది. డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్–చెన్నై సూప మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్లో విపరీతమైన ఆదరణ లభించింది. మొదట మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్ను విజయవంతంగా పూర్తిచేసినందుకు ధన్యవాదాలు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించలేక పోయి ఉంటే క్రికెటర్లు వారి కెరీర్లో అమూల్యమైన ఒక ఏడాది కాలాన్ని కోల్పోయి ఉండేవారు.” అని ధుమల్ అన్నారు.

ఇక కోవిడ్–19 విజృంభన దృష్ట్యా టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ “ఈ టోర్నీలో ఏవైనా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్సలు అందించాలని నిర్ణయించాం. దానికి తగ్గట్లే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి క్వారంటైన్ కోసం సుమారు 200 గదులను సిద్ధం చేశాం. తద్వారా కరోనా రోగులను నిర్బంధించి, వారు పూర్తిగా కోలుకున్న తర్వాతే టోర్నీలో చేరడానికి అనుమతిచ్చాం." అని ధుమల్ చెప్పారు. కాగా, ఐపీఎల్–13 సీజన్ నవంబర్ 10తో ముగిసింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీనీ దక్కించుకుంది. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.

First published:

Tags: Bcci, Corona virus, IPL 2020, UAE

ఉత్తమ కథలు