Home /News /sports /

3D PLAYER VIJAY SHANKAR ACHIEVED WHAT VIRAT KOHLI AND CHRIS GAYLE COULDN NOT GET IN IPL SJN

IPL 2022 : 3D ప్లేయరా మజాకా.. ఆడకపోయినా కోహ్లీ, డీవిలియర్స్ లకు దక్కని గౌరవాన్ని పొందిన గుజరాత్ ప్లేయర్

Gujarat Titans (IPL Twitter)

Gujarat Titans (IPL Twitter)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. విరాట్ కోహ్లీ (Virat Kohli), ఏబీ డీవిలియర్స్ (Ab de Villiers), క్రిస్ గేల్ (Chris Gayle) లాంటి దిగ్గజ ఆటగాళ్లకు దక్కని గౌరవం అనామక ప్లేయర్లకు దక్కుతుంది. ఐపీఎల్ లో దశాబ్దం నుంచి ఆడుతున్నా కూడా ఈ ముగ్గురు ప్లేయర్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయారు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. విరాట్ కోహ్లీ (Virat Kohli), ఏబీ డీవిలియర్స్ (Ab de Villiers), క్రిస్ గేల్ (Chris Gayle) లాంటి దిగ్గజ ఆటగాళ్లకు దక్కని గౌరవం అనామక ప్లేయర్లకు దక్కుతుంది. ఐపీఎల్ లో దశాబ్దం నుంచి ఆడుతున్నా కూడా ఈ ముగ్గురు ప్లేయర్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయారు. డీవిలియర్స్ అయితే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. కోహ్లీ ఆడుతున్నా క్రిస్ గేల్ మళ్లీ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి. వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లాంటి స్టార్ ప్లేయర్లకు కూడా ఐపీఎల్ ట్రోఫీని ఎత్తే భాగ్యం ఇప్పటి వరకు దక్కలేదు.

కానీ, త్రిడీ ప్లేయర్ విజయ్ శంకర్ కు మాత్రం ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశం వచ్చింది. తుది జట్టులో చోటు లేకపోయినా కేవలం గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్నందుకు  ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలు దిగే అవకాశం వచ్చింది. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో విజయ్ శంకర్ ను రూ. 1.40 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆరంభంలో తుది జట్టుల ోఅవకాశం కూడా ఇచ్చింది. అయితే మనోడు చెత్త ప్రదర్శన చేసి బెంచ్ కే పరిమితం అయ్యాడు.  ఈ సీజన్ లో అతడు నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం 19 పరుగులు మాత్రమే చేయడం విశేషం. ఇంత చెత్తాట ఆడినా సహచరుల పుణ్యమా అని కోహ్లీ, డీవీలియర్స్ లాంటి హేమాహేమీలకు దక్కని చాంపియన్ గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా విజయ్ శంకర్ ఐపీఎల్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ అతడితో ఓ ఆట ఆడుకున్నారు.





విజయ్ శంకర్ వచ్చే సీజన్ ల ో ఆడేది అనుమానంగానే ఉంది. ఈ సీజన్ లో చెత్త ప్రదర్శన చేసిన అతడిని గుజరాత్ టైటాన్స్ వదులుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్లీ విజయ్ శంకర్ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి జరిగే వేలంలో ఇతడిని కొనే సాహసం ఎవరూ చేయకపోవచ్చు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chris gayle, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Virat kohli

తదుపరి వార్తలు