న్యూజిలాండ్ క్రికెటర్ హార్ట్ బ్రోక్ మెసేజ్... ఓదార్చుతున్న నెటిజన్స్

ఎంతగానో బాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి అరగంట గురించి నేను ఆలోచించని రోజులు రానున్న పదేళ్ల కాలంలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయని ఆశిస్తున్నాను-జిమ్మీ నీషమ్.

news18-telugu
Updated: July 15, 2019, 10:36 AM IST
న్యూజిలాండ్ క్రికెటర్ హార్ట్ బ్రోక్ మెసేజ్... ఓదార్చుతున్న నెటిజన్స్
న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్
  • Share this:
వరల్డ్ కప్ 2019 ఫైనల్స్‌లో న్యూజిలాండ్ టీంది ఓటమి అని ఐసీసీ చెబుతున్నా... క్రికెట్ అభిమానులు జనం మాత్రం... కివీస్ జట్టు జనం మనసు గెలుచుకున్నారంటున్నారు. కప్పు ఇంగ్లాండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందని చెబుతన్నారు. ఆదివారం అర్థరాత్రి వరకు కొనాసగిన ఈ ఉత్కంఠ పోరులో ... రెండు జట్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్‌లో కూడా మ్యాచ్ టైం అయ్యింది. దీంతో బౌండరీలను లెక్కలోకి తీసుకున్న ఐసీసీ ఇంగ్లండ్‌నే విశ్వ విజేతగా ప్రకటించింది. ఆ సంబరాలు పక్కన పెడితే.. గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ టీం ఆవేదన మాత్రం వర్ణనాతీతం.

ఈ పుట్టెడు దుఖంలో... న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. బేకింగ్ మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. అంతకుముందుకూడా మ్యాచ్‌లో ఓటమి పాలైన విధానంపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘ఎంతగానో బాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి అరగంట గురించి నేను ఆలోచించని రోజులు రానున్న పదేళ్ల కాలంలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయని ఆశిస్తున్నాను.. కాంగ్రాట్స్ ఇంగ్లాండ్ అంటూ మరో పోస్టు పెట్టాడు.

జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు మాత్రం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని భరోసా ఇస్తున్నారు. ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ గెలిచినా... మీరంతా మా మనసు గెలుచుకున్నారంటూ మద్దతు తెలుపుతున్నారు. మొత్తం మీద తీవ్ర మనోవేదనలో ఉన్న కివీస్ క్రికెటర్లకు మేమున్నామంటూ.. అభిమానులంతా అండగా నిలుస్తున్నారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>