Home /News /sports /

2022 ICC U 19 WORLD CUP ALL YOU NEED TO KNOW FIXTURES TEAMS DATES VENUES LIVE STREAM AND TV TIMINGS VB

ICC U19 World Cup: కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న మినీ సంగ్రామం..ఫేవరెట్ బరిలో భారత్ .. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ICC U19 World Cup: అండర్ 19 ప్రపంచ కప్ (ICC U19 ప్రపంచ కప్) నేటి(జనవరి 14) నుంచి వెస్టిండీస్ లో ప్రారంభం కానుంది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా టైటిల్‌ కోసం భారత్‌నే గట్టి పోటీదారుగా నిలవనుంది.

ఇంకా చదవండి ...
అండర్ 19 ప్రపంచ కప్ (ICC U19 ప్రపంచ కప్) నేటి(జనవరి 14) నుంచి వెస్టిండీస్(West Indies) లో ప్రారంభం కానుంది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా టైటిల్‌(Tittle) కోసం భారత్‌నే గట్టి పోటీదారుగా నిలవనుంది. టీమ్ ఇండియా(Team India) U19 భారత జట్టు గురించి మాట్లాడుకుంటే.. ఈ టోర్నమెంట్‌లో(Tournament) అత్యంత విజయవంతమైన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. దీని కారణంగానే అందరి చూపు కూడా ఈ సారి ఈ టోర్నీపై పడింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నలిచింది. 2000, 2008, 2012, 2018 సంవత్సరాల్లో టీమ్ ఇండియా టైటిల్ ను ముద్దాడింది.

IPL 2022: ఐపీఎల్ ప్రేమికులకు ఈ సారి కూడా నిరాశే.. ఆ సందడి ఇక అక్కడ నుంచే.. వివరాలిలా..


గత మూడు సార్లు భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడంలో విజయవంతమైంది. వెస్టిండీస్‌లోని నాలుగు దేశాల్లో 48 మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఆంటిగ్వా, బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ మరియు ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో ఈ 10 వేదికలలో మ్యాచ్‌లను నిర్వహిస్తాయి. ఈ కీలక టోర్నీలో ఈసారి 16 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. గ్రూప్ B లో భారత్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండా .. గ్రూప్ సి లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, పపువా న్యూ గినియా, జింబాబ్వే .. గ్రూప్ D లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి.

కరోనా కారణంగా న్యూజిలాండ్ వైదొలిగిన తర్వాత స్కాట్లాండ్ ఈ గ్రూప్‌లో చేర్చబడింది. ఇలా.. రెండేళ్ల క్రితం భారత్‌ను ఓడించి తొలిసారి అండర్-19 టైటిల్‌ను గెలుచుకున్న బంగ్లాదేశ్‌ గ్రూప్-ఎలో, రెండుసార్లు విజేతలుగా నిలిచిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-సిలో ఉన్నాయి. వీసా సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆలస్యంగా ఇక్కడికి చేరుకుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడలేకపోయింది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంటాయి.

IPL Sponsors: IPL 2022 టోర్నీకి ప్రధాన స్పాన్సరర్స్‌ ఇవే.. పూర్తి వివరాలిలా..


ఇక ప్రస్తుతం బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు.. ఈరోజు నుంచే సమరానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం గ్రూప్ D నుంచి ఆస్ట్రేలియాతో ఆతిథ్య వెస్టిండీస్‌ తలపడనుంది. మరో గ్రూపులో శ్రీలంకతో స్కాట్లాండ్‌ తలపడనుంది. ఇక భారత్ రేపు (శనివారం) గయానా వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లు నేటి నుంచి ప్రారభం అయి.. జనవరి 22 వరకు గ్రూప్ దశలో మ్యాచ్ లు జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న జరగనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Cricket, ICC Under 19 World Cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు