Home /News /sports /

2022 EDITION OF INDIAN PREMIER LEAGUE COULD BE HELD IN SOUTH AFRICA SAYS REPORT VB

IPL 2022: ఐపీఎల్ ప్రేమికులకు ఈ సారి కూడా నిరాశే.. ఆ సందడి ఇక అక్కడ నుంచే.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఆటగాళ్లు తమ ట్యాలెంట్(Talent) ను నిరూపించుకునే ఒకే ఒక వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఈ టోర్నీలో తమ ప్రతిభను కనబరిచి.. టీమ్ ఇండియాలో(Team India) చోటు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటారు. అయితే కరోనా మహమ్మారి(Corona) కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ విదేశాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది

ఇంకా చదవండి ...
కొత్త ఆటగాళ్లు తమ ట్యాలెంట్(Talent) ను నిరూపించుకునే ఒకే ఒక వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఈ టోర్నీలో తమ ప్రతిభను కనబరిచి.. టీమ్ ఇండియాలో(Team India) చోటు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటారు. అయితే కరోనా మహమ్మారి(Corona) కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ విదేశాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. గత రెండు దఫాలు యూఏఈలో(UAE) నిర్వహించిన యాజమాన్యం.. ఇక ఈసారి మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ(BCCI) భావిస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Varient) విజృంభణతో దేశంలో మరోమారు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నెలకు కేసుల సంఖ్య విపరీతంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

IPL Sponsors: IPL 2022 టోర్నీకి ప్రధాన స్పాన్సరర్స్‌ ఇవే.. పూర్తి వివరాలిలా..


ఈ నేపథ్యంలో ఏప్రిల్(April) నాటికి దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోతే కనుక ఈసారి కూడా టోర్నీని భారత్ వెలుపలే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఈ సారి కూడా విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో మరోసారి క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే, ఈసారి యూఏఈ కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఐపీఎల్ 2022 సీజన్ కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రతీ సారి ఆదేశంపై ఆధారపడటం సరికాదని బీసీసీఐ భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

భారత్‌లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2009 సీజన్‌ని దక్షిణాఫ్రికాలోనే బీసీసీఐ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో.. ఆ దేశానికే మరో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకవేళ దక్షిణాఫ్రికాలో నిర్వహించడం సాధ్యం కాకుంటే అప్పుడు శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా సమయం కూడా ఆటగాళ్లకు కలిసొస్తుంది అని బీసీసీఐ అధికారి తెలిపాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు చేసిదంతా చేసి.. ఇప్పుడు బాధపడుతున్న షేన్ వార్న్..

ఐపీఎల్‌లో అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు సాగుతున్నాయని గత కొంతకాలంగా ఆటగాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యకు దక్షిణాఫ్రికా కాలమానం పరిష్కారం కాగలదని బోర్డు భావిస్తుంది. దక్షిణాఫ్రికా కంటే భారత్‌ 3 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించాలని భావిస్తే దక్షిణాఫ్రికాలో సాయంత్రం 4 గంటలకు తొలి బంతి పడుతుంది. కాబట్టి తొందరగానే మ్యాచ్‌లు ముగుస్తాయి.

ఇక దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ మొదటి కేసు నమోదైన దక్షిణాప్రికాలో ఈ టోర్ని నిర్వహించడం ఎంత వరకు సేఫ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నట్టు ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జో రూట్‌ తెలిపాడు. 2018 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన రూట్‌.. వచ్చే నెలలో జరిగే మెగా ఆక్షన్‌లో తన పేరును నమోదు చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా సుదీర్ఘ విరామం తర్వాత మెగా లీగ్‌కు తిరిగి రావాలనుకుంటున్నట్టు తెలిపాడు.
Published by:Veera Babu
First published:

Tags: IPL, IPL 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు