ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు షాకిచ్చిన వీవీఎస్ లక్ష్మణ్...

2020 T20 Cricket World Cup: టీ20 వరల్డ్ కప్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేసిన భారత జట్టులో ఎంఎస్ ధోనీతో పాటు శిఖర్ థావన్‌కి చోటు దక్కలేదు.

news18-telugu
Updated: January 9, 2020, 2:37 PM IST
ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు షాకిచ్చిన వీవీఎస్ లక్ష్మణ్...
వీవీఎస్ లక్ష్మణ్
  • Share this:
2020 సంవత్సరపు షెడ్యూల్‌లో టీమిండియాకి  అత్యంత కీలకమైనది టీ20 వరల్డ్ కప్. అక్టోబర్ 15 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. గత ఏడాది క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలవలేకపోయిన టీమిండియా...టీ20 వరల్డ్ కప్‌ను గెలిచితీరుతుందని సగటు భారత క్రికెట్ వీరాభిమాని ఘంటాపథంగా చెబుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు జట్టు కూర్పుపై బీసీసీఐ ఇప్పటి నుంచే దృష్టిసారించాలని మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా యువ రక్తానికి జట్టులో ప్రాతినిథ్యం కల్పించాలని సూచిస్తున్నారు. ఆ మేరకు టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా జరిగే ఆస్ట్రేలియాతో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్, న్యూజిలాండ్‌తో టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌‌లు, దక్షిణాఫ్రికాతో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో జట్టు కూర్పుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీ20 వరల్డ్ కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తన జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లైన ఎంఎస్ ధోనీ, శిఖర్ థావన్‌లకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన జట్టులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబెలకు చోటు కల్పించాడు.

వీవీఎస్ లక్ష్మణ్ 15 మంది సభ్యుల జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, చాహల్, కుల్‌దీప్ యాదవ్, మనీశ్ పాండే, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్
Published by: Janardhan V
First published: January 9, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading