2020 ఒలింపిక్స్ మెడల్స్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసా?

టోక్యో వేదికగా 2020 ఒలింపిక్స్ నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే మెడల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే.

news18-telugu
Updated: February 11, 2019, 9:36 PM IST
2020 ఒలింపిక్స్ మెడల్స్ ఎలా తయారు చేస్తున్నారో తెలుసా?
టోక్యో ఒలింపిక్స్ 2020
news18-telugu
Updated: February 11, 2019, 9:36 PM IST
క్రియేటివిటీ, అత్యంత నూతన టెక్నాలజీకి కేరాఫ్‌ అడ్రస్ జపాన్. అలాంటి జపాన్‌లోనే 2020 ఒలంపిక్స్ జరగబోతున్నాయి. ఈ టౌర్నమెంట్లో విజేతలకు అందజేసే మెడల్స్‌ను తయారు చేసేందుు స్మార్ట్‌గా ఆలోచించింది ఒలింపిక్స్ కమిటీ. అందుకోసం పాత స్మార్ట్ ఫోన్లను ముడిసరుకుగా వాడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ.. భారీగా పాత స్మార్ట్ ఫోన్ల రీసైక్లింగ్ ప్రక్రియను ఏడాది కాలంగా చేపట్టింది.

వాడేసిన స్మార్ట్ ఫోన్లతో మెడల్స్ ఎలా తయారు చేస్తారనే డౌట్ రావొచ్చు. అయితే ఆ స్మార్ట్ ఫోన్స్ మామూలువి కాదు.. గోల్డ్, సిల్వర్, కాంస్యం వంటి మెటల్స్‌తో తయారు చేసినవి. ఇప్పటవరకు కమిటీ.. 47 488 టన్నుల పాత పనికిరాని స్మార్ట్‌ఫోన్లను సేకరించింది. అంటే దాదాపుగా 5 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు. ఇవన్నీ జపనీస్ విరాళంగా ఇచ్చినవే కావడం విశేషం.

ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తన సేకరణలో దాదాపుగా తన టార్గెట్‌ను రీచ్ అయ్యంది. 30.3 కేజీల బంగారం, 4100 కిలోల బంగారం, 2700 కిలోల కాంస్యం లోహాలను సేకరించడంలో దాదాపుగా సఫలమైంది. టోక్యో కమిటీ మెడల్స్ తయారీ కోసం రాబోయే మార్చ్ 31 వరకు స్మార్ట్‌ఫోన్లను సేకరించాలని నిర్ణయించింది. అనంతరం ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో మెడల్స్ డిజైన్‌ ఫైనలైజ్ కానుంది.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...