క్రికెట్‌లో మాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి చేప గిఫ్ట్... ఎందుకో తెలుసుకొని తీరాల్సిందే

క్రికెట్ మ్యాచ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే... మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించి... ప్రైజ్ మనీ ఇస్తారు. అతనికి టేస్టీ చేపను గిఫ్ట్‌గా ఇచ్చారు. పూర్తి వివరాలు ఫటాఫట్ తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 22, 2020, 8:52 AM IST
క్రికెట్‌లో మాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి చేప గిఫ్ట్... ఎందుకో తెలుసుకొని తీరాల్సిందే
క్రికెట్‌లో మాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి చేప గిఫ్ట్... (credit - twitter)
  • Share this:
క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అనేది ప్రత్యేకమైనది. ఈ అవార్డ్ ఇవ్వడం ద్వారా... ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా ఆడుతారు. ఐతే... మన దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు, వన్డేలు, టెస్టుల్లో విజేతలకు క్యాష్ ప్రైజ్‌లు ఇస్తారు. కానీ... కాశ్మీర్... కుప్వారాలో జరిగిన స్థానిక టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కి ప్రత్యేక గిఫ్టు ఇచ్చారు. ఫిర్దుయస్ హసన్‌కి 2.5 కేజీల చేపను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా... ఇలా ఎందుకు చేశారని ఓ నెటిజన్ అడిగారు. అప్పుడు తెలిసింది ఓ వాస్తవం. తమ ప్లే గ్రౌండ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిపేందుకే... ఇలా ప్రత్యేక గిఫ్టు ఇచ్చినట్లు తెలిపారు. ఇలా చేపను ఇవ్వడం ద్వారా... అందరూ ఈ విషయంపై మాట్లాడుకుంటారు. తద్వారా... అక్కడ క్రికెట్ మ్యాచ్‌ల పరిస్థితి ఎంత దిగువ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.


ప్రస్తుతం కాశ్మీర్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితుల్లో కూడా పాలకులు లేరు. ప్లేయర్లు తమ సొంత డబ్బులు వేసుకొని టోర్నమెంట్ జరిగేలా చేస్తున్నామంటున్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లలో కొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ విన్నర్‌కి మటన్, సెకండ్ విన్నర్‌కి చికెన్ ఇమ్మంటున్నారు.

ఇలా ప్రత్యేక గిఫ్టులు ఇవ్వడమన్నది ఇదే తొలిసారి కాదు. 2013లో బంగ్లాదేశ్... ఢాకాలో జరిగిన ప్రీమియర్ లీగ్‌లో ల్యూక్ రైట్‌కి... ఓ బ్లెండర్‌ను గిఫ్టుగా ఇచ్చారు. 2017లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాకి... మినీ ట్రక్ ఇచ్చారు.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading