గంగూలీ చోక్క విప్పి హాడావుడి చేశాడంటే ఆ మ్యాచ్ ప్రాధన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నాట్‌వెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఊహించని విజయాన్ని అందుకుంది.
క్రికెట్ అంటే ఓ సంబురం.. ఓ ఆనందం.. ఇక భారతీయ అభిమానులకు అయితే అదో మతం. మ్యాచ్‌లు వస్తున్నాయంటే చాలు పనులు అన్ని పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతు ఉంటారు చాలా మంది. భారతీయ క్రీడా ప్రపంచంలో అత్యధికులకు ఇష్టమైన ఆట క్రికెట్. చాలా మంది భారతీయ అభిమానులకు క్రికెట్ ఎమోషన్. టీమిండియా విజయం సాధించదంటే ఇక ఫ్యాన్స్ సంబరాలు మాములుగా ఉండవు. మరి సాధరణ అభిమానులకే అలా ఉంటే ఆటగాళ్ళ విషయం ఏమిటి.ఇప్పటివరకు టీమిండియా సంబంధించిన విజయాల జ్ఞాపకాలు చాలా ఉన్నప్పటికి.. లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్ప సంబంరం చేసుకున్న సంఘటనను మాత్రం భారత అభిమానులు ఎప్పటికి మరిచిపోరు.
గంగూలీ చోక్క విప్పి హాడావుడి చేశాడంటే ఆ మ్యాచ్ ప్రాధన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నాట్‌వెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఊహించని విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ జట్టులో ట్రెస్కోథిక్, నాసర్ హుస్సేన్ సెంచరీలు సాధించడం.. భారత్ 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కష్ట సమయంలో యువీ, కైఫ్ కీలక భాగస్వామ్యంతో భారత్ గెలిచింది. ఈ విజయోత్సవాన్ని లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పి మరి సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇది జరిగి నేటికి 19 ఏళ్లైనా అభిమానుల మనసుల్లో ఇప్పటికి గుర్తుండిపోతుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ధేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలో దిగిన భారత్‌కు వీరేంద్ర సెహ్వాగ్ (45; 49 బంతుల్లో 7×4), సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత దినేశ్ మోంగియా (9), సచిన్ (14), ద్రవిడ్ (5) దారుణంగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా 146/5 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో యువరాజ్ సింగ్ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్ కైఫ్ (87*; 75 బంతుల్లో 6×4, 2×6) అద్భుతమైన పోరట పటిమను కనబరిచారు. భారత్ స్కోర్‌ను 250 పరుగులు దాటించారు. 267 స్కోర్ వద్ద యువీ ఔటయ్యాడు. 8 ఓవర్లలో భారత్ 58 పరుగులు చేయాలి.హర్భజన్ 13 పరుగులు చేయగా మిగితా టెలండర్ల సహాయంతో కైఫ్ మ్యాచ్‌ని గెలిపించాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.