IPL 2019: అశ్విన్ ‘మన్కడింగ్’ వివాదంపై రాహుల్ ద్రవిడ్ రియాక్షన్

బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేసిన అశ్విన్

IPL 2019 | అశ్విన్ బట్లర్‌ను అలా రనౌట్ చేయడంలో తనకేమీ తప్పు అనిపించడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. అలా ఔట్ చేసే హక్కు అశ్విన్‌కి ఉందన్నారు. 

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపనర్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ చేసిన తీరుపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా బట్లర్‌ను ఔట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అశ్విన్‌ను సమర్థిస్తున్నారు. తాజాగా అశ్విన్  ‘మన్కడింగ్’ ఔట్ చేయడంపై మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. అశ్విన్ బట్లర్‌ను అలా రనౌట్ చేయడంలో తనకేమీ తప్పు అనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అలా ఔట్ చేసే హక్కు అశ్విన్‌కి ఉందన్నారు.

    వ్యక్తిగతంగా తాను మాత్రం ఒకసారి బ్యాట్స్‌మన్‌ను ఒకసారి హెచ్చరిస్తానని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఎవరైనా దీనికి భిన్నంగా అలోచిస్తే వారి అభిప్రాయాన్ని గౌరవిస్తానని అన్నారు. అశ్విన్ మన్కడింగ్ నిబంధనలకు లోబడే ఉందన్నది స్పష్టమని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో అశ్విన్‌పై వినిపిస్తున్న విమర్శలను ‘అతి స్పందన’గా కొట్టిపారేశారు.
    Published by:Janardhan V
    First published: