Tanmay Singh : అండర్ 14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ (U-14 School Tournament)లో 13 ఏళ్ల తన్మయ్ సింగ్ (Tanmay Singh) రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. సునామీ లాంటి అతడి బ్యాటింగ్ లో ప్రత్యర్థి టీం కొట్టుకుపోయింది. కేవలం 132 బంతుల్లోనే 401 పరుగులు సాధించాడు. ఇందులో 30 ఫోర్లు, 38 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్ల ద్వారా డబుల్ సెంచరీ (228 పరుగులు), ఫోర్ల ద్వారా సెంచరీ (128 పరుగులు) చేయడం తన్మయ్ సింగ్ కే సాధ్యమైంది. సోమవారం నోయిడాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన మ్యాచ్‌లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరుఫున బరిలోకి దిగిన తన్మయ్ సింగ్ రెచ్చిపోయాడు. అతడితో పాటు రుద్ర బిదురి అజేయ సెంచరీ (135 నాటౌట్) చేశాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగులు చేసింది. అనంతరం ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా దేవరాజ్ స్కూల్ 463 పరుగుల తేడాతా గ్రాండ్ విక్టరీ సాధించింది.
ఇది కూడా చదవండి : ఆ విషయంలో ధోనిలా ఆలోచిస్తున్న సంజూ సామ్సన్.. అదే జరిగితే సూపర్ సక్సెస్ అయినట్లే
తొలుత బ్యాటింగ్ చేసిన ర్యాన్ ఇంటర్నేషనల్ కు తన్మయ్ సింగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి బంతి నుంచే దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి బాదాడు. తొలుత సెంచరీ.. ఆ తర్వాత డబుల్.. కాసేపటికే ట్రిపుల్.. ఆఖరికి 400 మార్కును దాటేశాడు. మ్యాచ్ లో అతడు 132 బంతులను ఎదుర్కొంటే అందులో 68 బంతులు బౌండరీలకు చేరడం అతడి దూకుడును చెబుతుంది. ఇందులో 38 సిక్సర్లు, 30 ఫోర్లు ఉన్నాయి.
656 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు కనీసం పోరాడకుండానే చేతులు ఎత్తేసింది.భారీ లక్ష్యం ముందు చేతులెత్తేసింది. కేవలం 193 పరుగులకే చాపచుట్టేసింది. స్కూల్ డేస్‌లో సచిన్, వినోద్ కాంబ్లీ రికార్డుస్థాయి ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. పాఠశాల టోర్నమెంట్‌లో 646 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శారదాశ్రమ్ విద్యామందిర్ తరఫున సచిన్ 326, కాంబ్లీ 349 రన్స్ చేశారు. హారిస్ షీల్డ్‌లో సర్ఫరాజ్ 439, పృథ్వీ షా 546 పరుగులు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.