1214 PLAYERS REGISTER FOR IPL 2022 PLAYER MEGA AUCTION AND CHRIS GAYLE NOT INTERESTED SRD
IPL 2022 Mega Auction : వామ్మో.. మెగావేలం కోసం ఇంత పోటీనా..? బరిలో ఎంతమంది ఆటగాళ్లంటే..
IPL 2022 Mega Auction
IPL 2022 Mega Auction : ఈ సీజన్ కోసం బీసీసీఐ (BCCI) పనులన్నీ వేగవంతం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలన్న దూకుడుతో ఉంది బీసీసీఐ. దీనికి సంబంధించిన మెగావేలం (IPL 2022 Mega Auction) వచ్చే నెలలో జరగనుంది.
ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం అభిమానులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త టీమ్‌లో వచ్చి చేరడం వల్ల మరింత మజా అందించేందుకు రెడీ అయింది ధనాధన్ లీగ్. ఇక, ఈ సీజన్ కోసం బీసీసీఐ(BCCI) పనులన్నీ వేగవంతం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలన్న దూకుడుతో ఉంది బీసీసీఐ. దీనికి సంబంధించిన మెగావేలం (IPL 2022 Mega Auction) వచ్చే నెలలో జరగనుంది. ఇప్పటికే ఈ లీగ్ కోసం 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి రెడీ అని ప్రకటించారు. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు.
ఈ వేలంలో మొత్తం క్యాప్డ్ భారత ఆటగాళ్లు (61 మంది), క్యాప్డ్ ఇంటర్నేషనల్ (209 మంది), అసోసియేట్ (41 మంది), ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్న అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు (143 మంది), గత సీజన్లలో పాల్గొన్న అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు (6 మంది), అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు (692 మంది), అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు (62) మంది తమ పేర్లను మెగావేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
విదేశీయుల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్గానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం.
వివిధ దేశాల నుంచి రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య :
దేశం
రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య
దేశం
రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య
అఫ్గానిస్థాన్
20
ఒమన్
3
ఆస్ట్రేలియా
59
భూటాన్
1
సౌతాఫ్రికా
48
యూఏఈ
1
శ్రీలంక
36
నెదర్లాండ్స్
1
ఇంగ్లండ్
30
స్కాట్లాండ్
1
న్యూజిలాండ్
29
బంగ్లాదేశ్
9
నేపాల్
15
ఐర్లాండ్
3
యూఎస్ఏ
14
నమీబియా
5
ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. మొత్తం పది జట్లు కలిపి 250 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొంతమందిని రిటెయిన్, సెలెక్ట్ చేసుకోవడంతో మెగా వేలం నుంచి 217 మందిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
భారత ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు 20 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్ప, ఉమేశ్ యాదవ్‌లు రెండు కోట్ల బేజ్ ప్రైజ్ జాబితాలో ఉన్నారు.
ఓవర్ సీస్ ప్లేయర్లతో కలిపి రెండు కోట్ల జాబితాలో 31 మంది ప్లేయర్లు ఉండగా.. 1.5 కోట్ల లిస్ట్‌లో 20 మంది, కోటి జాబితాలో 31 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. పియూష్ చావ్లా, కేదర్ జాదవ్, ప్రసిధ్ కృష్ణ, టీ నటరాజన్, మనీశ్ పాండే, అజింక్యా రహానే, నితీశ్ రాణా, వృద్దిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్, మహమ్మద్ నబీ, జేమ్స్ ఫాల్కనర్ కోటి లిస్ట్ లో ఉన్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.