• HOME
  • »
  • NEWS
  • »
  • MAN SUICIDE ATTEMPT WITH HIS TWO DAUGHTERS AT SADASIVPET IN SANGAREDDY VB

Telangana: కుమార్తెలకు పురుగుల మందు తాగించిన తండ్రి.. అనంతరం తాను కూడా తాగి.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా షాక్..

Telangana: కుమార్తెలకు పురుగుల మందు తాగించిన తండ్రి.. అనంతరం తాను కూడా తాగి.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా షాక్..

ప్రతీకాత్మక చిత్రం

Suicide attempt: క్షణికావేశంతో ఓ తండ్రి తన కుమార్తెలకు పురుగుల మందు తాపి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోగా ఒక కుమార్తె మరణించగా తండ్రి, మరో కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది.

  • Share this:
    క్షణికావేశంతో ఓ తండ్రి తన కుమార్తెలకు పురుగుల మందు తాపి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోగా ఒక కుమార్తె మరణించగా తండ్రి, మరో కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. కలిసి ఉండాల్సిన ఆలుమగలు నువ్వా.. నేనా అన్నట్టు గొడవ పడుతుండేవారు. తాజాగా భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. క్షణికావేశంలో ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు తాగించిన తండ్రి.. తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సదాశివపేట మండలం ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌కు, అల్లాదుర్గం గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కూతుర్లు సిరి, నవ్యశ్రీ (4) ఉన్నారు. మొదట్లో బాగానే కలిసి మెలసి ఉన్నారు. తర్వాత ఒకరిపై ఒకరు మనస్పర్థలు వచ్చేవి. అయితే భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా.. శివకుమార్‌ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటికి వెళ్లి అల్లదుర్గంలోనే ఉంటున్నది.

    కాగా శివకుమార్ తన భార్యను తీసుకొని వద్దామని అల్లాదుర్గం వెళ్లిన శివకుమార్‌ తన ఇద్దరు కూతుర్లను సదాశివపేటకు తీసుకువచ్చాడు. భార్యపై కోపంతో రాత్రి ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిని పరిశీలించిన డాక్టర్లు చిన్న కుమార్తె నవ్యశ్రీ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. శివకుమార్‌, పెద్ద కుమార్తె సిరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శివకుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, శివకుమార్‌ సూసైడ్‌ నోట్‌ రాసినట్లుగా తెలుస్తున్నది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి అత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెసుకున్న భార్య తన కూతురు చినిపోవడంతో బోరున విలపించింది. ఈ సంఘటతో గ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    Published by:Veera Babu
    First published: