హోమ్ /వార్తలు /Press Release /

Kothi Kommachi: 'కోతి కొమ్మచ్చి' థీమ్ సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు..

Kothi Kommachi: 'కోతి కొమ్మచ్చి' థీమ్ సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు..

కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ (Kothi Kommachi)

కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ (Kothi Kommachi)

Kothi Kommachi: మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్‌గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కోతి కొమ్మచ్చి' . తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కోతి కొమ్మచ్చి' . లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సరికొత్త పంథాలో 2D యానిమేషన్ తో థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ యానిమేషన్ వీడియో సాంగ్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసి టీంను అభినందించారు. 'కో కో కో కోతి కొమ్మచ్చి' అంటూ విడుదలైన ఈ టైటిల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ "మా 'కోతి కొమ్మచ్చి' చిత్రం నుండి మొదటిగా థీం సాంగ్ రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన మా రాజు గారికి ధన్యవాదాలు. కథలో ఓ మంచి సందర్భంలో వచ్చే ఈ పాటను 2d యానిమేషన్ లో విడుదల చేస్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం. అనూప్ ఎనర్జిటిక్ మ్యూజిక్, శ్రీమణి లిరిక్స్ కలిసి ఈ సాంగ్ ని అందరికీ నచ్చేలా చేశాయి. సినిమాలో ఈ పాటకు మా హీరో హీరోయిన్స్ డాన్స్ చేసినప్పటికీ థీం సాంగ్ లో మాత్రం కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కోతులతో డాన్స్ చేయించాం. ఇది పిల్లల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ కుటుంబ మంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాం" అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ "ఈ రోజు మా సినిమాలో ఓ మంచి పాటతో ప్రమోషన్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సాంగ్ సినిమాలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని భావిస్తున్నాము. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ కి అలాగే చక్కని సాహిత్యం అందించిన శ్రీమణి గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోన పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం" అన్నారు.

kothi kommachi movie theme song dil raju,kothi kommachi team interview,meghamsh kothi kommachi,kothi kommachi movie trailer,kothi kommachi 2020 telugu movie,kothi kommachi movie shooting,kothi kommachi interview,kothi kommachi movie team interview,kothi komachi movie,kothi kommachi movie opening,kothi kommachi shooting begins,కోతి కొమ్మచ్చి షూటింగ్,కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ దిల్ రాజు
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ (Kothi Kommachi)

అనూప్ రుబెన్స్ మాట్లాడుతూ "మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. సతీష్ గారు కథకు తగ్గట్టు మంచి సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ ఆల్బంలో అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి. అన్నీ పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ థీమ్ సాంగ్ ని ఆదరించి మంచి విజయం చేస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

First published:

Tags: Satish Vegesna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు