వినియోగదారుల సంతృప్తి విషయంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) నెంబర్ వన్‌గా నిలిచింది. వినియోగదారుల అభిప్రాయాలను ప్రతిసారీ ఆలకిస్తూ వారికి మరింత దగ్గరవుతోందని.. వినియోగదారుల సంతృప్తిలో ఒప్పో నెం.1 బ్రాండ్‌గా నిలిచిందని ఈ కంపెనీ పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ఈ గుర్తింపు దక్కించుకోవడం ద్వారా వినియోగదారులకు తమ మొబైల్ ఉత్పత్తులు ఎంతలా చేరువయ్యాయో స్పష్టమవుతోందని తెలిపింది. ఒప్పో విక్రయాననంతర సేవల అనుభవాన్ని ఆరు ప్రముఖ నగరాల్లో అధ్యయనం చేశారు. దాని ప్రకారం 93% మంది వారి అనుభవాన్ని ‘‘చాలా ఉత్తమం’ లేదా అత్యుత్తమం అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఒప్పో వినియోగదారుల్లో వేచి ఉండే సమయం చాలా తక్కువ అని సమీక్షకు స్పందించిన వారిలో సగానికిపైగా చెప్పగా, వారు తమ సమస్యను తీసుకు వచ్చిన కేవలం 15 నిమిషాల్లో ప్రతిస్పందించారని, అధ్యయన నివేదిక పేర్కొంది.
ఒప్పో ఇండియా అధ్యక్షుడు ఎల్విస్ ఝౌ మాట్లాడుతూ ‘‘కౌంటర్ పాయింట్ రీసర్చ్ నిర్వహించిన విక్రయాననంతరం వినియోగదారుల సంతృప్తిలో నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అనే గుర్తింపు దక్కించుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మానవ సమాజానికి సాంకేతికత, ప్రపంచానికి కరుణ అనే మా లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క వినియోగదారునికి సంతృప్తి అందించాలన్నదే మా ధ్యేయం. భారతదేశంలో మా కార్యకలాపాలకు వృద్ధి చేసే మరియు బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ప్రజలకు అసాధారణ అనుభవాలను అందించేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ అధ్యయనం వినియోగదారుల మద్దతుకు సర్వీస్ స్టేటస్ అప్‌డేట్ అత్యంత ముఖ్యమైనదని వెల్లడించింది. ఒప్పో వినియోగదారుల మద్దతులో అగ్రగామిగా ఉండగా పలువురు వినియోగదారులు వాట్సప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ పొందుతారు. ఈ అధ్యయనం ప్రకారం ఒప్పో విక్రయాననంతరం పంపిణీలో అత్యంత వేగవంతంగా ప్రతిస్పందన ఇస్తుండగా, సమీక్షకు స్పందించిన వారిలో గరిష్ఠ సంఖ్యలో వారు తమ మొబైల్ ఫోన్‌ను అదే రోజు అందుకుంటున్నారు.
ఒప్పో వినియోగదారుల్లో, చాలా వరకు సమీక్షకు స్పందించిన వారిలో చాలా మంది.. తమ ప్రస్తుత సమస్య పూర్తిగా పరిష్కారం అయిన తరువాత మొబైల్ ఫోన్‌ను స్వీకరించారు. దీని ఫలితంగా ప్రస్తుతం సర్వీస్ అనంతరం సంతృప్తి ఒప్పో వినియోగదారుల్లో అత్యంత వృద్ధి చెందింది. అంతేకాకుండా అత్యంత ఎక్కువగా ఖర్చు ఆదా చేసే బ్రాండ్‌గానూ ఒప్పో గుర్తింపు దక్కించుకుది.
ప్రస్తుత కష్ట సమయాల్లో మరియు భౌతిక దూరాన్ని పాటించాల్సిన నేపథ్యంలో ఈ ఏడాది ఒప్పో ‘గో గ్రీన్ గో డిజిటల్’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇందులో బ్రాండ్ దేశ వ్యాప్తంగా తమ వినియోగదారులకు డిజిటల్ ఇన్‌వాయిస్‌లను పరిచయం చేసింది. దీనిలో భాగంగా అన్ని ఒప్పో సేవా కేంద్రాలు రిపేరి ఇన్‌వాయిస్‌లను వినియోగదారులతో వాట్సప్ బ్రాడ్ కాస్ట్ ద్వారా పంచుకుంటుంది. ఈ బ్రాండ్ ప్రత్యేకమైన ఏఐతో తయారుగా ఉండే చాట్‌బోట్ ‘ఒల్లీ’ని పరిచయం చేయగా, ఇది వినియోగదారులకు 24 X 7 అందుబాటులో ఉంటూ వారి 94.5% మేర ఎంక్వైరీలకు సమాధానం తెలియజేస్తోంది.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నప్పుడు వాట్సప్‌లో మానవ చాట్ సపోర్ట్ కూడా వినియోగదారులకు 24 X 7 వారి సమస్యను పరిష్కరించడం ప్రారంభించింది. ఇది ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా తన వినియోగదారులకు చేరువ అయ్యేందుకు అందించిన అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది ఒప్పో. 500 ప్రత్యేక సేవా కేంద్రాలను 500+ నగరాల్లో విస్తృత నెట్‌వర్కుతో కలిగి ఉన్న ఈ బ్రాండ్ దేశంలోని అత్యుత్తమ కుగ్రామాల్లోనూ సేవలు అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology, Oppo, Technology