మూవీ మొఘల్ రామానాయుడు 85వ జయంతి వేడుకలు..

Ramanaidu Birth Anniversary: మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 6, 2020, 12:26 PM IST
మూవీ మొఘల్ రామానాయుడు 85వ జయంతి వేడుకలు..
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)
  • Share this:
మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ... 85వ జయంతి సందర్భంగా రామానాయుడుకు నివాళులు అర్పించాం.. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదులో సినిమా పరిశ్రమ, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు.
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)


ఫిలింనగర్‌లో విగ్రహంతో పాటు రామానాయుడు గారి పేరుతో ఎది మొదలు పెట్టినా సక్సెస్. ఫిలింనగ‌ కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు లాంటి వారని చెప్పారు. ఆ తర్వాత నిర్మాత సి‌.కళ్యాణ్ మాట్లాడుతూ .. రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్. నాకు దాసరి గారు, రామానాయుడు గారు ఎంతో ప్రొత్సహించిన వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా.. సినీ పరిశ్రమ, దానికి అనుంబంద ఆఫీస్‌లన్నీ డెవలెప్ కావటానికి రామానాయుడు గారే కారణం. నాయుడు గారిని తలుచుకుని మేము సినిమా స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతిని ఎప్పుడూ గొప్పగా జరుపుకుంటామన్నాము. రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్ ను ఫిల్ చెస్తాడన్నారు.
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)

అనంతరం రామానాయుడు మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా మెంటల్‌గా నాకు సపోర్ట్ గానే ఉంటారన్నారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ .. నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి.‌ వారి ఫాలోవర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్‌లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రొత్సాహం ఎంతో ఉందన్నారు.
First published: June 6, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading