హోమ్ /వార్తలు /Press Release /

Priya Varrier Rohit Nandan Ladi Ladi: మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం.. యంగ్ హీరో రోహిత్ నంద‌న్..

Priya Varrier Rohit Nandan Ladi Ladi: మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం.. యంగ్ హీరో రోహిత్ నంద‌న్..

చిరంజీవి రోహిత్ నందన్ (Chiranjeevi Rohit Nandan)

చిరంజీవి రోహిత్ నందన్ (Chiranjeevi Rohit Nandan)

Priya Varrier Rohit Nandan Ladi Ladi: నో ఐడియా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ఈ ల‌డిల‌డి పాట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌లు నుంచి విశేషాద‌ర‌ణ అందుకుంటుంది.

ఇంకా చదవండి ...

నో ఐడియా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ఈ ల‌డిల‌డి పాట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌లు నుంచి విశేషాద‌ర‌ణ అందుకుంటుంది. ఈ మాసీ నెంబ‌ర్‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల కంపోజ్ చేశారు, అలానే బిగ్ బాస్ 3 విన్న‌ర్, హ్యాపేనింగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఈ పాట‌ను ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట య్యూటూబ్ తో పాటు ఇత‌ర సంగీత మాధ్య‌మాలు ద్వారా శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా యువ న‌టుడు రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవిగారిని ఆద‌ర్శంగా తీసుకుని డాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపారు. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డిల‌డి అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌లు ద్వారా ఈ ఆల్బ‌మ్ లోకి ఇంట‌ర్నెట్ సెన్షేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ ని, తీసుకున్నామ‌ని అన్నారు రోహిత్ నంద‌న్ అన్నారు. ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్ట్ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్రీ సీమ‌లోకి అడుగుపెట్టార‌ని, ఆమె ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగంద‌ని రోహిత్ తెలిపారు.

priya prakash varrier,ladi ladi video song,priya varrier songs,priya prakash varrier videos,priya varrier video songs,priya varrier ladi ladi song,priya prakash varrier songs,priya prakash warrier song,priya p varrier ladi ladi,priya prakash varrier wink,priya prakash varrier interview,'ladi ladi' private song,priya varrier hot,priya varrier navel,ప్రియా వారియర్ లడీ లడీ ప్రైవేట్ సాంగ్,రోహిత్ నందన్ చిరంజీవి
ప్రియా ప్రకాశ్ వారియర్ రోహిత్ నందన్ లడీ లడీ సాంగ్

తొలిసారిగా తాను చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆద‌రించ‌డం, యూట్యూబ్ లో ఈ పాట‌కు 2 మిలియ‌న్ పైగా వ్యూస్ రావ‌డం తన‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని రోహిత్ నంద‌న్ తెలిపారు. తాను త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇస్తున్నాని రోహిత్ అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ త్వ‌ర‌లోనే రాబోతుంది.

First published:

Tags: Chiranjeevi, Priya Prakash Varrier, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు