ముఖానికి సర్జరీ.. నువ్వా నాకు చెప్పేది.. షేన్‌వార్న్‌పై శామ్యుల్స్ ఫైర్

యువకుడిగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్న నువ్వా.. నా గురించి మాట్లాడి అంటూ షేన్ వార్న్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు శామ్యూల్స్.

news18-telugu
Updated: October 28, 2020, 10:58 PM IST
ముఖానికి సర్జరీ.. నువ్వా నాకు చెప్పేది.. షేన్‌వార్న్‌పై శామ్యుల్స్ ఫైర్
షేన్ వార్న్, శామ్యూల్స్, స్టోక్స్ (Twiiter/ipl)
  • Share this:
సోషల్ మీడియాలో వెస్టిండీస్ క్రికెటర్ మర్లోన్ శామ్యూల్స్ రచ్చ కొనసాగుతోంది. ఇటీవల బెన్ స్టోక్స్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అతడు.. ఇప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌ను మరోసారి టార్గెట్ చేశాడు. బెన్ స్టోక్స్‌పై శామ్యూల్ చేసిన వ్యాఖ్యలను షేన్ వార్న్ ఖండిచడంతో పాటు అతడిపై సెటర్లు వేసిన విషయం తెలిసిందే. శామ్యూల్‌కు మతి చెడిందని.. ఎవరైనా సాయం చేయండని ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన శామ్యూల్స్.. షేన్ వార్న్‌పై ఎదురుదాడికి దిగాడు. యువకుడిగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్న నువ్వా.. నా గురించి మాట్లాడి అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అసలు గొడవేంటంటే....?

ఐపీఎల్ 2020 సీజన్‌లో బెన్ స్టోక్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆలస్యంగా ఐపీఎల్‌‌లోకి వచ్చిన అతడు.. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రౌండ్‌లోక అడుగు పెట్టాడు. అంతకుముందు తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల కారణంగా పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల కోసం పాకిస్తాన్ నుంచి న్యూజిలాండ్ వెళ్లిన స్టోక్స్ 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లో ఉన్నాడు. దాని గురించి ఇటీవల మాట్లాడిన అతడు.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని.. తన బద్ధ శత్రువైన శామ్యూల్‌కు కూడా రావద్దని కోరుకుంటానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సరదాగానే చేశాడు స్టోక్స్.

స్టోక్స్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్న శామ్యూల్స్ ఇన్‌స్టగ్రామ్ వేదికగా రెచ్చిపోయాడు. ఇన్‌స్టా స్టోరీల్లో దారుణమైన పదజాలంతో స్టోక్స్ ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. ''ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించు.. 14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.'' అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. శామ్యూల్స్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అంతర్జాతీయ క్రికెటర్ స్థానంలో ఉంది ఇంతటి నీచమైన భాష వాడతావా? అంటూ పలువురు క్రికెటర్లు, నెటిజన్లు శామ్యూల్స్‌పై మండిపడ్డారు.


ముఖ్యంగా షేన్ వార్న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరూ చెప్పే వారు లేక శామ్యూల్స్ పిచ్చోడవుతున్నాడని మండిపడ్డాడు. 'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో అతనికి సహాయం అవసరం. కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయం చేయరు. ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్‌. నా కొడుక్కి ఎవరైనా సాయం చేయండి.' అని ట్వీట్ చేశారు వార్న్.

షేన్ వార్న్ చేసిన ఈ ట్వీట్‌పై మళ్లీ మండిపడ్డాడు మర్లోన్ శామ్యూల్స్. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న నువ్వా.. నాకు నీతులు చెప్పేది. యువకుడిగా కనిపిచేందుకు క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ సర్జరీ చేయించుకోలేదు అని ఎదురుదాడికి దిగాడు. కాగా, శామ్యూల్స్ తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ఇంత దిగుజారి మాట్లాడతావా...? అంటూ మండిపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 28, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading