Home /News /press-release /

AGHORAS TAKE CLASS TO POLICE WHO SUSPECTED THEIR IN EAST GODAVARI DISTRICT WHAT HAPPENED NGS

Real Akhanda: పోలీసులకు నడి రోడ్డుపై అఖండ సినిమా చూపించిన అఘోరాలు.. అసలేం జరిగిందంటే..?

Real Akhanda: అఖండ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా మాస్ జాతర ఆగడం లేదు. ఇప్పటికే బాలయ్య అఘోరాగా చెప్పిన డైలాగ్స్.. అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు అఘోరాలకు ఫుల్ క్రేజ్ వస్తోంది. తాజాగా ఏపీలో కొందరు అఘోరాలను పోలీసులు అదుపులోకి తసుకున్నారు.. అయితే వారం ఏం చేశారో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Real Akhanda: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టికెట్ల ధరలు తగ్గాయి.. 50 శాతం ఆక్యుపెన్సీతో చాలాచోట్ల సినిమహాళ్లు నడుస్తున్నాయి. కరోనా వైరస్ (Corona Virus) భయంతో కొందరు సినిమా థియేటర్ వైపు అడుగులు వేయడం లేదు.. ఇలాంటి సమయంలో జై బాలయ్య అంటూ వచ్చిన అఖండి సినిమా మాస్ జాతరను తలపించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ  (Nandmuri Balakrishna)రెండు విభిన్న పాత్రల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) కలెక్షన్ల వర్షం కురిపింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా చాలా థియేటర్లలో విజయవంతగా నడిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అన్న సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో అఘోరాలకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అఘోరాలు అంటే ఈ రేంజ్ లో ఉంటారా.. వాళ్లకు అంత పవర్ ఉంటుదా అన్నది ఓ రేంజ్ లో చూపించారు సినిమాలో.. అందుకు ఇప్పుడు నిజమైన అఘోరాలు ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తున్నారు..

  తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అఘోరాలు హల్ చల్ చేశారు. పి.గన్నవరం మండలం ముంగండ పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వారు తిరుగుతున్నారు. అయితే ఓ నలుగురు నలుగురు అఘోరా సాధువులు కలిసి తిరుతున్నారని సమాచారంతో కొందరిలో భయం మొదలైంది. అఘోరాలు అనుమానాస్పదంగా తిరగడంతో భయాందోళన చెందిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఆ అఘోరాలను అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారు. ఇక్కడ ఏం పని అంటూ తమదైన స్టైల్లో నిలదీశారు. అయితే తాము యాత్రలో భాగంగా కాశీ నుంచి వచ్చామని సాధువులు పోలీసులకు తెలిపారు. వారి దగ్గర ఉన్న బ్యాగులను పోలీసులు చెక్ చేశారు. ఆ సమయంలో అఘోరాలు హిందీ మాట్లాడుతూ కనిపించారు. వారు చెప్పిన వివరాలను నోట్ చేసుకున్న పోలీసులు.. నమ్మకం కుదరడంతో తిరిగి పంపించివేశారు. అది కూడా బాలయ్య లెవల్లో ఓ అఘోరా పోలీసులు తన వాయిస్ వినిపించారు.

  అయితే భారతదేశంలోని హిందూ సమాజం అఘోరాలను అత్యంత పవిత్రంగా కొలుస్తుంది. ఎందుకంటే అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. వీరి జివన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అఘోరాలు కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు. శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకుని తిరుగుతుంటారు. గంజాయి తాగుతూ నగ్నంగా సంచరిస్తుంటారు. అందుకే సాధారణంగా వీరిని చూడాలి అంటే భయపడతారు.. కానీ అఖండి సినిమా సూపర్ హిట్ తరువాత అఘోరాలకు కూడా క్రేజ్ పెరిగింది..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Akhanda movie, Andhra Pradesh, AP News, Balakrishna

  తదుపరి వార్తలు