ZAFARYAB JILANI SUNNI WAQF BOARD LAWYER SAYS WE RESPECT THE JUDGEMENT BUT WE ARE NOT SATISFIED SB
అయోధ్య తీర్పుతో అసంతృప్తి ఉంది.. కానీ గౌరవిస్తున్నాం: సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్
అయోధ్య తీర్పుతో అసంతృప్తి ఉంది.. కానీ గౌరవిస్తున్నాం: సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్
అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్లీంలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది
ఏళ్లుగా నానుతున్న అయోధ్య వివాదాస్సద స్థలంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్లీంలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది. అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ జాఫర్యాబ్ జిలాని. కానీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు. సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. తీర్పులో ప్రతీ అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ.. కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే అంశాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ అంశంపై ఎలాంటి ప్రదర్శనలు చేయమని స్పష్టం చేశారు.
అయోధ్య తీర్పును వెలువరిస్తూ... ప్రజల విశ్వసాలను, నమ్మకాల్ని గౌరవిస్తున్నామని తెలిపింది సుేప్రీంకోర్టు ధర్మాసనం. మరోవైపు నిర్మాహి అఖాడా పిటిషన్‌ను కూడా కొట్టివేసింది ధర్మాసనం. హక్కుల విషయంలో నిర్మోహ అఖాడా వాదన కూడా సరిగా లేదని పేర్కొంది. దీంతో పాటు అక్కడ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారనడానికి పురావస్తు శాఖ ఆధారాల్లేవని న్యాయస్థానం తెలిపింది. బాబ్రీ మసీదును కూడా ఖాళీ స్థలంలో నిర్మించలేదని పేర్కొంది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.