జగన్‌పై అలిగిన బాబాయ్... ప్రచారానికి దూరం... విదేశాలకు పయనం ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారానికి వైవీ సుబ్బారెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. తోడు ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గించి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కూడా వైవీ సుబ్బారెడ్డిలో ఉందని సమాచారం.

news18-telugu
Updated: March 29, 2019, 8:43 PM IST
జగన్‌పై అలిగిన బాబాయ్... ప్రచారానికి దూరం... విదేశాలకు పయనం ?
వైఎస్ జగన్(File)
  • Share this:
వైసీపీలో కీలక నేతగా వెలిగిన ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఈ సారి ఒంగోలు ఎంపీ సీటు కేటాయించలేదు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైవీ సుబ్బారెడ్డి అభ్యంతరాలను పక్కనపెట్టి మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ కేటాయించింది వైసీపీ. ఈ కారణంగానే తాడేపల్లిలో జగన్ కొత్త ఇంటి ప్రారంభోత్సవానికి దూరంగా ఉండిపోయారు వైవీ సుబ్బారెడ్డి. అయితే మళ్లీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో... వైవీ సుబ్బారెడ్డి కూల్ అయ్యారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారానికి వైవీ సుబ్బారెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గించి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కూడా వైవీ సుబ్బారెడ్డిలో ఉందని సమాచారం. ఈ కారణంగా ప్రచారానికి దూరంగా ఉన్న వైవీ... ఎన్నికలు పూర్తయ్యేంతవరకు విదేశాలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేక ఆయనను లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.


First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>