హోమ్ /వార్తలు /politics /

TTD Chirman: సీఎం జగన్ బాబాయ్ రూటు మార్చారా..? స్వామి కార్యంతో పాటు స్వకార్యం పూర్తి చేస్తున్నారా..?

TTD Chirman: సీఎం జగన్ బాబాయ్ రూటు మార్చారా..? స్వామి కార్యంతో పాటు స్వకార్యం పూర్తి చేస్తున్నారా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

YV Subbareddy political strategy: సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తన రూటు మార్చారు. గత రెండేళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన.. ఇలా ఉంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భావించారు.. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..?

  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  YV Subbareddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అయన రూటు చాలా సపరేటు.. రాష్ట్ర ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగిన వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy). పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి బాబాయ్ గా.. పెద్ద దిక్కుతగా తోడు ఉండి వచ్చారు కూడా.. దీంతో ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాలు.. భవిష్యత్తు రాజకీయాలు.. జిల్లాలో గ్రూపులు అన్నింటినీ బేరీజు వేసుకున్న సీఎం జగన్.. బాబాయ్ ను  ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంచారు.  ఆధ్యాత్మిక సేవకు వైవీ సుబ్బారెడ్డిని చేరువ చేశారు అబ్బాయి జగన్.  దింతో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కు పరిమితం అయ్యారు. రెండో మారు టీటీడీ చైర్మన్ (TTD Chirman) గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు సీఎం. అడగకుండానే వచ్చిన స్వామి కార్యని.... ప్రత్యక్షంగా ఉంటూ... స్వకార్యని నెరవేర్చుకుంటున్నారు వైవీ సుబ్బారెడ్డి.

  మొదటి సారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి కేవలం స్వామి వారి కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి వంటి అంశాలపై అధికంగా ఫోకస్ పెట్టారు. రెండేళ్ల తరువాత చైర్మన్ పదవీకాలం ముగియగానే..  రాజ్యసభ లేదా.. ఎమ్మెల్సీ అయ్యి మంత్రి వర్గంలో బెర్తు దక్కుతుందని ఆశించారు.  కానీ అనూహ్యంగా రెండోసారి కూడా టీటీడీకే పంపడంతో అటు స్వామి కార్యం స్వకార్యం చేసుకొనే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారట వైవీ.

  ఇదీ చదవండి: ఎమ్మెల్యే రోజా ఇంట సందడి.. ఇటు కూతురు పుట్టిన రోజు.. అటు వినాయక చవితి వేడుకలు

  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.... 2019లో టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. హిందూ సనాతన ధర్మంపై ఎంతో మక్కువ ఉన్న వైవీనీ.... ఆచార వ్యవహారాలు., దైవ భక్తిలో జంధ్యం వేసుకొని బ్రాహ్మణుడు ఆయనలో ఉన్నాడని అయన సన్నిహితులు చెపుతారు. అయితే అయన ఆలా చైర్మన్ పీఠం ఎక్కరో లేదో.... ఆయనపై క్రిస్టియన్ ముద్ర వేసే ప్రయత్నం చేసాయి విపక్షాలు.  అదే సమయంలోమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.... ఆచార వ్యవహారాల్లో... హిందూ సంప్రదాయాలను పాటించడంలో వైవీ తనను మించిన బ్రాహ్మణుడని కొనియాడారు. చిన్నప్పటి  వైవీని చూడటంతోనే సీఎం జగన్ ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమించారని.. అందుకే రెండో సారి కూడా టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డికి మరోమారు అవకాశం వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

  ఇదీ చదవండి: తొలి వారం ఓటింగ్ లో మానస్ దూకుడు.. అతడి గురించి ఈ విషయాలు తెలుసా?

  మొదటి టర్మ్ లో ఎక్కువగా స్వామి వారి సేవకు పరిమితమై... తన్మయత్వం చెందారు వైవీ. ఆ సమయంలోను ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరించారు. చుట్టంచూపుగా ఎప్పుడో ఒక మారు మాత్రమే జిల్లాల్లో పర్యటించే వారు. రెండేళ్ల పదివి కాలం ముగిసాక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొలని ఎంతగానో ప్రయత్నాలు చేసారు. అధిష్టానం మాత్రం వైవీ సుబ్బారెడ్డికి మరోమారు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దింతో కొంత అయిష్టంగానే టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరించారు.

  ఇదీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ.. అంత పెద్ద పోస్టు ఎందుకు వదులుకున్నారు? ఆదిత్యనాథ్ ను ప్రభుత్వం వద్దనుకుందా?

  నామినేటెడ్ పదవిలోనే ఉంటె పట్టు కోల్పోతామనో..  లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతామనే లెక్కలతో..., సుబ్బారెడ్డి తన రూట్ మార్చారు. టీటీడీతో పాటు ఉభయ గోదావరి జిల్లాళ్లపై ప్రత్యేక ఫోకస్ ఉంచారు. చిన్న కార్యక్రమం జిల్లాలో చేపట్టిన.. ఫుల్ జోష్ లో పాల్గొంటున్నారు. కరోనాతో చనిపోయిన నేతల ఇళ్లకు వెళ్లిస్వయంగా పరామర్శలు చేసారు. కొత్త కార్పొరేషన్ చైర్మన్ల ప్రమాణస్వీకారం కూడా అయన పాల్గొన్నారు.

  ఇదీ చదవండి: ఆమె వయసు 25 ఏళ్ల లోపే.. అత్యవసరం అంటూ ఓ బైక్ ఆపి లిఫ్ట్ అడిగింది.. ఆ పై ఊహించని ట్విస్ట్

  ఉభయగోదావరి జిల్లాల్లోని పార్టీ కార్యకర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. రాజమండ్రి, ఉండి నియోజకవర్గాలతోపాటు పలు ప్రాంతాల్లో వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలను పరిష్కరిస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు వైవీ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఆ పీఠంపై వైసీపీ కార్పొరేటర్‌ను కూర్చోబెట్టాలని చూస్తున్నారు. రానున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుని టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరేయడానికి నేతలతో వ్యూహ రచన చేస్తున్నారు. రాజమండ్రిలోని వైసీపీ నేతలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో నడిపిస్తున్నారు వైవీ. ఈ విధంగా సుబ్బారెడ్డి పార్టీపై ఫోకస్‌ పెట్టడంతో కొందరు నేతలు పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొనే అవకాశం కలుగుతోందని సంబర పడుతున్నారట.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, YV Subba Reddy

  ఉత్తమ కథలు