హోమ్ /వార్తలు /politics /

YS Sharmila: ఊహించని విధంగా వైఎస్ షర్మిలను ఇరికించిన వైసీపీ

YS Sharmila: ఊహించని విధంగా వైఎస్ షర్మిలను ఇరికించిన వైసీపీ

జగన్, షర్మిల (ఫైల్ ఫోటో)

జగన్, షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: ఏపీకి చెందిన మంత్రి చేసిన కామెంట్స్‌పై స్పందించాల్సి వస్తే.. టీఆర్ఎస్‌తో పాటు ఏపీలోని అధికార వైసీపీని కూడా షర్మిల విమర్శించాల్సి ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.

ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కేసీఆర్ ఏపీలోనూ రాజకీయ పార్టీ పెడతారనే కామెంట్స్‌పై భిన్నమైన స్పందనలు వచ్చాయి. రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని కొందరంటే.. వైసీపీకి చెందిన మంత్రి పేర్ని నాని మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. రెండు రాష్ట్రాలను కలిపిస్తే.. ఇక్కడ మళ్లీ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండదని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందించలేదు. అయితే టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి మాత్రం పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర ఉన్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. మళ్లీ ఏపీ, తెలంగాణను కలిపేందుకు కేసీఆర్, జగన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని.. జగన్ జైలుకెళితే కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అయితే ఎవరెన్ని మాట్లాడినా.. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసే అవకాశం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓ టీవీ డిబేట్‌లో అన్నారు. ఇదిలా ఉంటే తన కామెంట్స్‌తో వైసీపీ.. వైఎస్ షర్మిలను ఇరికించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వైఎస్ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల.. తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా పాదయాత్ర కూడా చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై మరింతగా రాజకీయ దుమారం చెలరేగితే.. షర్మిల కూడా దీనిపై స్పందించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తే.. షర్మిల అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. షర్మిలను రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఆమెను ప్రశ్నించింది కాంగ్రెస్. అయితే తెలంగాణకు న్యాయంగా వచ్చే నీటి వాటాను వదులుకోబోమని కామెంట్ చేసిన షర్మిల.. ఏపీపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

అయితే తాజాగా ఏపీకి చెందిన మంత్రి చేసిన కామెంట్స్‌పై స్పందించాల్సి వస్తే.. టీఆర్ఎస్‌తో పాటు ఏపీలోని అధికార వైసీపీని కూడా షర్మిల విమర్శించాల్సి ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ చర్చ షర్మిల వరకు వెళుతుందా ? అనే వాదన కూడా ఉంది. అయితే తెలంగాణ విషయంలో తాను పూర్తి చిత్తశుద్ధితో ఉన్నానని నిరూపించుకునేందుకు షర్మిల ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారేమో అనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా.. వైసీపీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో షర్మిలను ఇరుకున పెడతాయా ? అన్నది వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, YS Sharmila, Ysrcp

ఉత్తమ కథలు